iDreamPost

Mrunal Thakur: OTTలో ఈ హిట్ మూవీ చూశారా? మృణాల్ ఠాకూర్ ఏకంగా ఆ రేంజ్ లో!

కేవలం 10 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ నటించిన హిట్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఉంది. మరి ఆ హిట్ మూవీని మీరు చూశారా? ఏ ఓటీటీలో ఉందంటే?

కేవలం 10 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మృణాల్ ఠాకూర్ నటించిన హిట్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో ఉంది. మరి ఆ హిట్ మూవీని మీరు చూశారా? ఏ ఓటీటీలో ఉందంటే?

Mrunal Thakur: OTTలో ఈ హిట్ మూవీ చూశారా? మృణాల్ ఠాకూర్ ఏకంగా ఆ రేంజ్ లో!

మృణాల్ ఠాకూర్.. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ‘సీతారామం’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు కొట్టేస్తోంది. ఇక ఈ అమ్మడు నటించిన ఓ హిట్ సినిమా ఓటీటీలో సందడి చేస్తోంది. ఆ చిత్రానికి ఓ ప్రత్యేక ఉంది. ఆ బాలీవుడ్ మూవీని కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేశారు. కార్తీక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్ లాంటి భారీ కాస్టింగ్ తో 10 రోజుల్లో సినిమా పూర్తి చేయడం.. అది కూడా యాక్షన్ థ్రిల్లర్. మరి ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఆ చిత్రాన్ని మీరు చూశారా?

కార్తిక్ ఆర్యన్, మృణాల్ ఠాకూర్ జంటగా డైరెక్టర్ రామ్ మధ్వాని తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం ధమాకా. ఈ మూవీ ఓ ప్రత్యేక రికార్డును క్రియేట్ చేసింది. కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అది కూడా కరోనా లాక్ డౌన్ టైమ్ లో. 2021లో రిలీజ్ అయిన ఈ చిత్రం 2020 డిసెంబర్ 14న షూటింగ్ స్టార్ట్ చేసి.. డిసెంబర్ 24న ముగించింది. 90 శాతం సినిమాను ముంబైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో చేశారట. ఇక ఈ చిత్రాన్ని ఇంత త్వరగా పూర్తి చేయడం తనని షాక్ కు గురిచేసిందని ఓ సందర్భంలో కార్తిక్ ఆర్యన్ కూడా చెప్పుకొచ్చాడు. దీంతో బాలీవుడ్ చరిత్రలో అతి తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మూవీల్లో ఒకటిగా ధమాకా రికార్డు నెలకొల్పింది.

కాగా.. ఈ ఫిల్మ్ లో గత చిత్రాలకు భిన్నమైన పాత్రలో మెరిసింది మృణాల్. జర్నలిస్ట్ క్యారెక్టర్ లో అద్భుతంగా నటించింది. కొంత మంది దుండగులు ఓ బ్రిడ్జిని పేల్చివేసి.. దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఈ సంఘటన నుంచి జనాల్ని ఎలా కాపాడారు? అన్నదే సినిమా కథ. న్యూస్ ప్రజెంటర్ గా కార్తీక్ ఆర్యన్ నటించగా.. అతడికి భార్యగా, రిపోర్టర్ గా మృణాల్ నటించింది. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది మీరు కూడా చూసేయండి. ఇదిలా ఉండగా.. కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఐదు నెలలు పట్టిందట. మరి కేవలం టెన్ డేస్ లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Sandeep Kishan: నా లవ్ సీక్రెట్‌గా ఉంచా! రెజీనా విషయంలో సందీప్ కిషన్ క్లారిటీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి