Swetha
ఓటీటీ లో ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పొందుతున్న సినిమాలంటే హర్రర్ అండ్ మర్డర్ మిస్టరీస్ చిత్రాలే. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఓ మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ రెండవ సీజన్.. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
ఓటీటీ లో ఇప్పుడు ఎక్కువగా ఆదరణ పొందుతున్న సినిమాలంటే హర్రర్ అండ్ మర్డర్ మిస్టరీస్ చిత్రాలే. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా ఓ మర్డర్ మిస్టరీకి సంబంధించిన ఒక వెబ్ సిరీస్ రెండవ సీజన్.. ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది.
Swetha
ఇప్పుడు ఓటీటీ సినిమాలలో మర్డర్ మిస్టరీస్ అండ్ హర్రర్ సినిమాలకు ఆదరణ బాగా లభిస్తోంది. ఈ క్రమంలో మర్డర్ మిస్టరీ తరహాలో వచ్చిన వెబ్ సిరీస్ సన్ ఫ్లవర్ . ఒక హత్య చుట్టూ ఈ సిరీస్ కథ తిరుగుతూ ఉంటుంది. సన్ ఫ్లవర్ అనే అపార్ట్మెంట్ లో జరిగే ఓ హత్య చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ ఏ ఈ సన్ ఫ్లవర్. ఒక క్రైమ్ కు కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్.. మొదటి సీజన్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఆ మొదటి సీజన్ కు కంటిన్యుషన్ గా .. సన్ ఫ్లవర్ సీజన్ 2ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి, ఈ రెండవ సీజన్ ఎలా ఉండబోతుంది. ఏ ప్లాట్ ఫార్మ్ లో దీనిని చూడొచ్చు అనే విషయాలు చూద్దాం.
సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ 2021,జూన్ లో వచ్చింది. ఆ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ లోనే సన్ ఫ్లవర్ అనే అపార్ట్మెంట్ లో ఓ హత్య జరిగినట్లుగా చూపించారు. మరి ఈ హత్యలు ఎవరు చేశారు? ఎందుకు చేశారు ? అనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ కొనసాగుతుంది. అయితే, ఆ హత్యకు గురైన వ్యక్తి నివసించే ప్లాట్ కు ఎదురుగా ఓ లెక్చరర్ ఉంటాడు, ఇంకా అదే అపార్ట్మెంట్ లో వేరే ఫ్లోర్ లో సునీల్ గ్రోవర్ ఉంటాడు. ఆ హత్యకు సంబంధించి వీరువురు ప్రధాన అనుమానితులుగా ఉంటారు. మొదటి సీజన్ మొత్తం వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. చూసే వారికి అసలు ఆ లెక్చరర్ ఏ.. మెయిన్ కిల్లర్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇక సునీల్ గ్రోవర్ చేసే పనులు కూడా అపార్ట్మెంట్ లో చూసేవారందరికి.. ఇతనే ఆ హత్య చేసాడేమో అనే అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో సునీల్ గ్రోవర్ ఓ అమ్మాయికి హెల్ప్ చేయబోయి తానే కిడ్నాప్ కు గురవుతాడు. దీనితో ఆ సీజన్ ముగుస్తుంది. ఇక ఇప్పుడు ఆ సీజన్ కు కంటిన్యుషన్ గా రెండవ సీజన్.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ 5లో.. మార్చి 4వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక సన్ ఫ్లవర్ సీజన్ 2 కథ విషయానికొస్తే.. ఇది కూడా మళ్ళీ అదే ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సీజన్ లో రోజీ మెహతా అనే కొత్త క్యారెక్టర్ ను ప్రవేశ పెట్టారు. సీజన్ వన్ లో ఏ వ్యక్తి అయితే.. హత్యకు గురవుతాడో అతను.. రోజీ పేరున విల్లు రాసి పెడతాడు. దీనితో ఆమె అతని ఫ్లాట్ లోకి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటికే అనుమానితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులతో పాటు రోజీ కూడా ఆ లిస్ట్ లో యాడ్ అవుతుంది. దీనితో పోలీసులకు ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మరింత టఫ్ గా మారుతుంది. ఈ సిరీస్ లో కొన్ని ట్విస్ట్ లో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సిరీస్ లో క్లైమాక్స్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరో దాదాపుగా పోలీసులు గుర్తించే సమయంలో వారికీ మరో ట్విస్ట్ ఎదురౌతుంది. అక్కడినుంచి సీజన్ 3కి లీడ్ ఇచ్చారు మేకర్స్. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి, సన్ ఫ్లవర్ సీజన్ 2 సిరీస్ ఓటీటీ అప్ డేట్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.