iDreamPost
android-app
ios-app

ఫర్జీ సీజన్ 2 రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్

Farzi Season 2: అమెజాన్ లో ఫర్జీ సిరీస్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు ఈ సీరిసీ సీజన్ 2కి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.

Farzi Season 2: అమెజాన్ లో ఫర్జీ సిరీస్ క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్నీ కాదు. ఇప్పుడు ఈ సీరిసీ సీజన్ 2కి సంబంధించి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది.

ఫర్జీ సీజన్ 2 రిలీజ్ డేట్ పై స్ట్రాంగ్ బజ్

షాహిద్ కపూర్ నటించిన ‘ఫర్జీ’ సిరీస్ ఓటీటీలో విడుదలై ఏడాది దాటింది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఫర్జీ సీజన్ 2 త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. 2023లో అత్యధిక మంది వీక్షించిన హిందీ వెబ్ షోగా ఫర్జీ రికార్డు సృష్టించింది. మీడియా కన్సల్టింగ్ సంస్థ ఓర్మాక్స్ నివేదిక ప్రకారం ఈ సిరీస్ ను 37.1 మిలియన్ల మంది వీక్షించారు. కాగా 2023 లో 30 మిలియన్ల వీక్షకులు ఈ సినిమాని చూశారు. అంతే కాకుండా భారతదేశంలో అత్యధికంగా వీక్షించబడిన సబ్ స్క్రిప్షన్ వీడియో-ఆన్-డిమాండ్ (SVOD) సిరీస్ గా కూడా నిలిచింది. మొదటి సీజన్ క్లైమాక్స్ మంచి ట్విస్ట్ తో ముగియడంతో ప్రేక్షకులు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే మేకర్స్ ఫర్జీ సీజన్ 2 నుంచి కూడా బిగ్ వ్యూయర్ షిప్ ను ఆశిస్తున్నారు.

ఈ సీరీస్ లో ప్రధాన పాత్రలలో నటించిన షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి తమ నటనతో కథలోని ఇంటెన్సిటీని పెంచారు . థ్రిల్స్, ఎమోషన్స్, కామెడీతో గ్రిప్పింగ్ యాక్షన్ సీన్స్ ఫర్జీలో ఉన్నాయి. ఫర్జీలో, సునీ (షాహిద్ కపూర్), మైఖేల్ (విజయ్ సేతుపతి), ఫిరోజ్ (భువన్ అరోరా), నాను (అమోల్ పాలేకర్), మన్సూర్ దయాల్ (కే కే మీనన్), మేఘా (రాశి ఖన్నా) తో సహా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు ప్రేక్షకులని అలరించాయి. ప్రతి ఒక్క పాత్రకు కథ లో మంచి ప్రాముఖ్యత ఉంటుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సిరీస్ సృష్టికర్తలు రాజ్ నిడిమోరు, కృష్ణ డికె (రాజ్ & డికె) ది ఫ్యామిలీ మ్యాన్ లో వారు సృష్టించిన సీక్రెట్ ఏజెంట్ల పాత్రలను ఫర్జీ సీరీస్ లో ప్రవేశపెట్టి మల్టీ వర్స్ మొదలుపెట్టారు. ఇప్పటికీ ప్రైమ్ వీడియో ఫర్జీ సీజన్ 2 విడుదల తేదీని ఇంకా ప్రకటించనప్పటికీ, 2024 చివరిలో లేదా 2025 ఫిబ్రవరిలో ఈ సీరీస్ విడుదల అవుతుందని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetTimebetMeritkingGrandpashabetcasibomimajbet girişrobinbetjojobet girişslot siteleriMariobetMadridbetmadridbetmariobetjojobetgrandpashabet girişgrandpashabetJojobetGrandpashabetjojobetGrandpashabet Girişgrandpashabet