iDreamPost
android-app
ios-app

శివరాత్రి స్పెషల్.. రేపు ఒక్కరోజే OTTలోకి వచ్చేస్తున్న 8 సినిమాలు!

OTT New Releases: మహా శివరాత్రి సెలవును ఎలా ఎంజాయ్ చేయాలి అనే ప్రశ్న ఉంటే మాత్రం ఈ ఓటీటీ రిలీజెస్ తో టైమ్ పాస్ చేసేయండి.

OTT New Releases: మహా శివరాత్రి సెలవును ఎలా ఎంజాయ్ చేయాలి అనే ప్రశ్న ఉంటే మాత్రం ఈ ఓటీటీ రిలీజెస్ తో టైమ్ పాస్ చేసేయండి.

శివరాత్రి స్పెషల్.. రేపు ఒక్కరోజే OTTలోకి వచ్చేస్తున్న 8 సినిమాలు!

ఓటీటీలు వచ్చిన తర్వాత ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా కూడా ప్రేక్షకులకు చాలడం లేదు. ప్రతి వారం ఏయే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటూ తెగ వెతికేస్తూ ఉంటారు. ఇంక శివరాత్రిలాంటి స్పెషల్, పైగా హాలిడే వచ్చింది అంటే కచ్చితంగా కొత్త కొత్త సినిమాలు కావాలి అని కోరుకుంటారు. అలాంటి వారి కోసం మార్చి 8న ఏకంగా ఓటీటీల్లోకి 9 సినిమాలు వచ్చేస్తున్నాయి. చాలామంది థియేటర్ సినిమాల మీద కూడా ఫోకస్ పెట్టారు. రేపు థియేటర్లలో అయితే ఏకంగా మూడు సినిమాలు రిలీజ్ ఉన్నాయి. టాలీవుడ్ లో గామి, భీమా సినిమాలు ఉండగా.. హిందీలో మాధవన్- అజయ్ దేవగణ్- జ్యోతికల సైతాన్ మూవీ రాబోతోంది.

థియేటర్లలో అయితే అదిరిపోయే సినిమాలు ఉన్నాయి. అలాగని ఓటీటీని నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదండోయ్. ఎందుకంటే ఓటీటీలో కూడా మంచి సినిమాలే ఉన్నాయి. ఒక్కరోజే ఏకంగా 9 సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. నిజానికి మార్చి 7 అర్ధరాత్రికే చాలా సినిమాలు స్ట్రీమింగ్ స్టార్ట్ అయిపోతుంది కూడా. వీటిలో రెండు మాత్రం అటు ఇటుగా ఉన్నాయి. హనుమాన్ స్ట్రీమింగ్ మీద క్లారిటీ లేదు. జీ5 సంస్థ కూడా మాకు ఎలాంటి సమాచారం లేదు అంటూ కామెంట్స్ చేసింది. అలాగే ఊరిపేరు భైరవకోన కూడా స్ట్రీమింగ్ అవుతుంది అంటూ పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ, వాటికి సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సడెన్ ఓటీటీలో స్ట్రీమ్ చేసి సర్ ప్రైజ్ చేస్తారు అంటున్నారు. అయితే హనుమాన్, ఊరిపేరు భైరవకోన సినిమాలపై మాత్రం క్లారిటీ లేదు. మిగిలిన చిత్రాల్లో నెట్ ఫ్లిక్స్ లో మేరీ క్రిస్మస్, అన్వేషిప్పిన్ కండేతుమ్, లాల్ సలామ్, హాట్ స్టార్లో ట్రూ లవర్ చిత్రాలు మస్ట్ వాచ్ లిస్ట్ లో ఉంటాయి.

మార్చి 8 స్ట్రీమింగ్ చిత్రాలు:

  • నెట్ ఫ్లిక్స్:
  • మేరీ క్రిస్మస్(హిందీ మూవీ)
  • అన్వేషిప్పిన్ కండేతుమ్(మలయాళం డబ్బింగ్)
  • లాల్ సలామ్(తమిళ్ మూవీ)
  • డామ్ సెల్(యాక్షన్ మూవీ)
  • లోన్ అవే(వెబ్ సిరీస్)
  • ది క్వీన్ ఆఫ్ టియర్స్(కొరియన్ సిరీస్)
  • హాట్ స్టార్:
  • ట్రూ లవర్(తమిళ్ మూవీ)
  • షోటైమ్(హిందీ మూవీ)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomMadridbetMadridbetextrabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusuJojobet Girişgrandpashabet telegramgrandpashabet girişCratosroyalbetGrandpashabetGrandpashabetMeritkingcasibomjojobetCasibom Güncel Girişjojobet girişjojobet girişjojobet girişcasibom