Dharani
Shivani Rajashekar: కోట బొమ్మాళి పీఎస్‌లో జోడిగా నటించిన శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ కాంబోలో వస్తోన్న సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
Shivani Rajashekar: కోట బొమ్మాళి పీఎస్‌లో జోడిగా నటించిన శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ కాంబోలో వస్తోన్న సినిమా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. ఆ వివరాలు..
Dharani
ప్రస్తుతం ఓటీటీలకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒకప్పుడు సినిమా చూడాలంటే.. థియేటర్లకు వెళ్లాలి.. లేదంటే అవి టీవీల్లోకి వచ్చే వరకు ఆగాలి. మధ్యలో కొంత కాలం సీడీ, డీవీడీ ప్లేయర్లు నడిచాయి. కానీ కరోనా తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. మూవీ చాలా బాగుంది అంటేనే థియేటర్‌కు వెళ్లి చూస్తున్నారు. లేదంటే ఓటీటీలోకి వచ్చే వరకు వెయిట్ చేస్తున్నారు. ఇక ఓటీటీలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని కొన్ని సినిమాలు నేరుగా వాటిల్లోనే విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఒకటి నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఆ వివరాలు..
శివానీ రాజశేఖర్, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం ‘విద్యావాసుల అహం’. కోట బొమ్మాళి పీఎస్ తర్వాత రాహుల్, శివానీ కాంబో మరోసారి ఈ మూవీతో రిపీట్ అవుతోంది. పెళ్లయిన కొత్త జంట మధ్య ఈగోలతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు.. చివరకు వాటిని ఎలా పరిష్కరించుకున్నారు అనే కథతో ఈ మూవీ సాగుతుంది. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలోనే విడుదలకు రెడీ అవుతోంది. దీని గురించి చిత్ర బృందం సోమవారం నాడు సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన చేసింది.
రాహుల్, శివానీ జంటగా తెరకెక్కనున్న‘విద్యా వాసుల అహం’ సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. విడుదల తేదీ గురించి సోమవారం నాడు ఆహా ఒక అప్డేట్ ఇచ్చింది. త్వరలో ఈ మూవీని స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఆహాలో విద్యావాసుల అహం త్వరలోనే వస్తుందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆహా. “ఎవరెస్టులో సగం. ఈ విద్య, వాసుల అహం. ఆ కహానీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం. కమింగ్ సూన్” అని ఆహా ట్వీట్ చేసింది.
‘విద్యావాసుల అహం’ టైటిల్‍కు ‘ఏ లాంగ్.. లాంగ్ ఈగో స్టోరీ’ అనే క్యాప్షన్ ఉంది. ఈ మూవీకి సంబంధించి టీజర్ గతేడాది డిసెంబర్‌లోనే వచ్చింది. అయితే ముందుగా ఈ సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని భావించినా.. ఇప్పుడు నేరుగా ఆహా ఓటీటీలోకి తీసుకొచ్చేస్తున్నారు. ఈ సినిమాకు మణికాంత్ గెల్లి దర్శకత్వం వహించారు. రాహుల్ విజయ్, శివానీ ప్రధాన పాత్రలు చేయగా.. శ్రీనివాస్ అవసరాల, అభినయ, తనికెళ్ల భరణి, శ్రీనివాసరెడ్డి, మౌనిక రెడ్డి, రవివర్మ, కాశీ విశ్వనాథ్ కీలకపాత్రలు పోషించారు.
ఎవరెస్టు శిఖరంలో సగం..🏔️
ఈ ‘విద్య, వాసుల’ అహం!🙄
ఆ కహనీ ఏంటో త్వరలో ఆహాలో చూద్దాం!💁🏻♂️💁♀️#VidyaVasulaAham 🎥 coming soon only on aha@ActorRahulVijay @Rshivani_1 @gellimanikanth @ETERNITY_ENT5 @mdmoturu @kumar_kodali @LMakkapati @itsKalyaniMalik @subashKatta @tjcreations123 pic.twitter.com/Qnkk0UaPVZ— ahavideoin (@ahavideoIN) May 6, 2024