Swetha
షారుఖ్ ఖాన్ రీసెంట్ గా నటించిన మూవీ డంకీ.. థియేటర్లలో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఓటీటీలో ప్రసారం అవ్వడానికి సిద్ధంగా ఉంది.
షారుఖ్ ఖాన్ రీసెంట్ గా నటించిన మూవీ డంకీ.. థియేటర్లలో ఓ మోస్తరు వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం.. ఎట్టకేలకు ఓటీటీలో ప్రసారం అవ్వడానికి సిద్ధంగా ఉంది.
Swetha
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నటించిన చిత్రం “డంకీ”. భారీ అంచనాల మధ్యన ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 21న థియేటర్లలో విడుదల అయింది. అంతేకాకుండా విడుదల సమయంలో ఒక టాలీవుడ్ చిత్రంతో కూడా పోటీపడింది డంకీ. కానీ, విడుదల తర్వాత ఊహించినంత రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒక మోస్తరు కలెక్షన్లతో సరిపెట్టేసుకుంది ఈ చిత్రం. ఇక థియేటర్ లో మిస్ ఈ చిత్రాన్ని మిస్ అయిన ఆడియన్స్ .. ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్ లో విడుదలైన ఇన్ని రోజుల తర్వాత ఈ చిత్రం.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీ రిలీజ్ ను , స్ట్రీమింగ్ పార్టనర్ ను ప్రకటించారు మేకర్స్.
షారుఖ్‌ఖాన్, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం “డంకీ”. అయితే , గతంలో షారుఖ్ నటించిన పఠాన్, జవాన్ సినిమాలు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాలు వెయ్యి కోట్లకుపైగా వసూళ్లను రాబట్టడంతో.. డంకీ సినిమాపైన భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ, థియేటర్ లలో విడుదల అయిన తర్వాత.. డంకీ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ ను కూడా నిరాశ పరిచింది. ఈ క్రమంలో డంకీ ఓటీటీ హక్కులను.. జియో సినిమా 155 కోట్లకు కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా.. బాలీవుడ్‌లో అధిక ధరకు ఓటీటీ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా కూడా డంకీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 16 నుంచి జియో సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వబోతుందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్నీ త్వరలోనే మూవీ జియో సినిమా అధికారికంగా ప్రకటించనుంది.
ఇక డంకీ సినిమాలో.. తాప్సీ హీరోయిన్‌గా నటించింది. విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్, బొమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా కథ విషయానికొస్తే.. అక్రమంగా విదేశాలకు వలస వెళుతోన్న వారి జీవితాల నేపథ్యంలో.. డంకీ సినిమాను తెరకెక్కించారు. ఇందులో హర్ దయాల్ సింగ్ అలియాస్ హర్డీ సింగ్ గా.. ఒక ఎమోషనల్ రోల్‌లో షారుఖ్‌ఖాన్ కనిపించాడు. హర్డీ సింగ్, మన్నుతో పాటు ముగ్గురు స్నేహితులు.. తమ సమస్యల నుంచి గట్టెక్కడానికి డంకీ రూట్‌లో ఇండియా నుంచి ఇంగ్లండ్‌కు వలస వెళ్తారు. ఈ జర్నీలో వారు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కొన్నారు? మన్ను హర్డీ సింగ్ ఇంగ్లండ్ నుంచి ఇండియాకు ఎందుకు తిరిగి వచ్చాడు?. హర్డీ సింగ్, మన్ను మళ్లీ కలుసుకున్నారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ. ఇక ఈ చిత్రం త్వరలోనే జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. మరి, ఈ డంకీ ఓటీటీ రిలీజ్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.