iDreamPost
android-app
ios-app

OTTలోకి సేవ్ ది టైగర్స్2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

  • Published Feb 14, 2024 | 5:53 PM Updated Updated Feb 14, 2024 | 5:53 PM

మొత్తానికి పురుష పుంగవులు ఎదురు చూస్తున్న సేవ్ ది టైగర్స్ సీక్వెల్ గురించి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ కు తెర దించుతూ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ పంచుకుంది ప్రముఖ ఓటీటీ సంస్థ..

మొత్తానికి పురుష పుంగవులు ఎదురు చూస్తున్న సేవ్ ది టైగర్స్ సీక్వెల్ గురించి క్రేజీ అప్ డేట్ బయటకు వచ్చింది. ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని వెయిటింగ్ కు తెర దించుతూ ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ పంచుకుంది ప్రముఖ ఓటీటీ సంస్థ..

  • Published Feb 14, 2024 | 5:53 PMUpdated Feb 14, 2024 | 5:53 PM
OTTలోకి సేవ్ ది టైగర్స్2.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

ఓటీటీ పుణ్యమా అని థియేటర్లకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా.. కుటుంబమంతా సినిమాలు చూసే వెసులు బాటు కలిగింది. ప్లాన్స్ బట్టి మెంబర్ షిప్ తీసుకుంటే సరి.. తెలుగు సినిమాలే కాకుండా.. మొత్తం దునియాలో ఎక్కడ ఏ సినిమా అయినా రిలీజైన కొన్ని రోజుల్లోనే.. ఈ డిజిటల్ ఫ్లాట్ ఫాంలోకి ప్రత్యక్షమవుతుంది. హాలీవుడ్, కొరియన్, బాలీవుడ్, మాలీవుడ్..ఏ మూవీ అయినా చూసేందుకు లేదు అనర్హం అన్నట్లుగా మారిపోయారు సినీ ప్రియులు. వీటికి తోడు వెబ్ సిరీస్‌లు ఉండనే ఉన్నాయి. రెండు గంటల్లో ముగించలేని కథలను.. చాలా వివరంగా వెబ్ సిరీస్‌ల రూపంలో ముందుకు తీసుకు వస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు ఓటీటీల్లో ఈ సిరీస్‌లకు మంచి టైమ్ నడుస్తోంది. సిరీస్ అయిపోగానే.. దానికి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు.

తెలుగులో కూడా అనేక సిరీస్‌లు అలరించాయి. కానీ ప్రత్యేకంగా పురుషులు బాగా కనెక్ట్ అయిన డ్రామా.. సేవ్ ది టైగర్స్. ఇప్పుడు ఈ సిరిస్ సీక్వెల్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది డిస్నీ ప్లస్ హాట్ స్టార్. త్వరలో సేవ్ ది టైగర్స్ 2 రాబోతుందంటూ అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది. ద టైగర్స్ ఆర్ బాక్ అంటూ ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఇందులో ముగ్గురు హీరోలు జైల్లో ఖైదీలుగా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ ఆడియన్స్‌కు ఆకట్టుకుంటుంది. కాగా, మార్చిలో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అప్ డేట్ ఇచ్చే అవకాశాలున్నాయి.

చైతన్య కృష్ణ, ప్రియదర్శి, అభినవ్ గోమఠం, జోర్దార్ సుజాత, రోషిణి, దేవయాని, పావని గంంగారెడ్డి, వేణు ఎల్దండి కీలక పాత్రలు పోషించారు. మహి వి రాఘవ్, ప్రదీప్ అద్వైతం, విజయ్ నమోజు, ఎస్ ఆనంద్ కార్తీక్ రచన అందించగా.. మహి వి రాఘవ, చిన్నా వాసుదేవ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. తేజ కాకుమాను దర్శకుడు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. భార్యా బాధితులైన ముగ్గురు భర్తల చుట్టూ కథ తిరుగుతుంది. ఫన్ అండ్ ప్రస్టేషన్‌తో మంచి ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్ సిరీస్‌గా తెరకెక్కింది. విక్రమ్, రాహుల్, గంటా రవి మిత్రులు. .భార్యా బాధితులుగా ఎందుకు మారారు.. వీరి కాపురాల్లో ఎలాంటి సమస్యలు వచ్చాయో చూపించడంతో.. పెళ్లైన మగవాళ్లు.. ఈ సీరిస్‌కు కనెక్ట్ అయిపోయారు.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetartemisbetartemisbetbetsmovebetsmovexslotxslotjojobetcratosroyalbetbetparkwgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabet