iDreamPost
android-app
ios-app

యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగా అన్ కట్ వర్షన్ వచ్చేస్తోంది..

  • Published Dec 23, 2023 | 10:08 PM Updated Updated Dec 27, 2023 | 2:22 PM

Animal Movie OTT Release: యానిమల్ చిత్రం పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

Animal Movie OTT Release: యానిమల్ చిత్రం పాన్ ఇండియా లెవల్లో క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది.

  • Published Dec 23, 2023 | 10:08 PMUpdated Dec 27, 2023 | 2:22 PM
యానిమల్ సినిమా సందీప్ రెడ్డి వంగా అన్ కట్ వర్షన్ వచ్చేస్తోంది..

యానిమల్ సినిమా రిలీజ్ అయ్యి 20 రోజులు దాటిపోయినా కూడా .. ఇప్పటికీ ఆడియన్స్ ఆ ట్రాన్స్ లోనే ఉన్నారు. చిత్ర బృందం గత కొన్ని రోజులుగా సినిమాలో ఉన్నా సాంగ్స్ ను విడుదల చేస్తూ వస్తోంది. ఆ పాటలు వింటూ ప్రేక్షకులు మరోసారి యానిమల్ మూవీని గుర్తు చేసుకుంటున్నారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం.. అంతకు మించి అలరించింది. ఎంతటి ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్ కి వెళ్లినా కూడా అంతకు మించి థ్రిల్ ని ఇచ్చింది. సందీప్ రెడ్డి వంగా మార్క్ ఏంటో చూపించినట్లు అయ్యింది. నిజానికి అర్జున్ రెడ్డి అనేది సందీప్ వంగా విజన్ కి ట్రైలర్ మాత్రమే అని చెప్పాలి. ఇప్పుడు యానిమల్ ఆడియన్స్ కి సందీప్ మరో సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు.

యానిమల్ చిత్రానికి పాన్ ఇండియా లెవల్లో ఉన్న సినిమా లవర్స్ ఫిదా అయిపోయారు. సందీప్ రెడ్డి వంగాకు గుడి కట్టించడం ఒక్కటే బాకీ ఉంది. ఈ సినిమా బాక్సీఫీస్ వద్ద రూ.859 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రణ్ బీర్ కెరీర్ లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. సందీప్ వంగాకి బ్యాడ్ రివ్యూస్ ఇచ్చే బాలీవుడ్ రివ్యూవర్లు కూడా ముక్కున వేలేసుకునేలా చేసింది. బాలీవుడ్ లో ఉన్న మాఫియానే బాహాటంగా ప్రశ్నిస్తున్నా కూడా సందీప్ రెడ్డి వంగా స్టామినాకి నోరెత్తలేని పరిస్థితిలో బాలీవుడ్ పెద్దలు పడిపోయారు. మొత్తానికి ఈ చిత్రం ఒక సన్సేషన్ అనే చెప్పాలి. ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటూ ఆడియన్స్ నీరాజనాలు పట్టారు. ఈ సినిమా రన్ టైమ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ 3 గంటల 22 నిమిషాలకు పైగా ఉంటుంది. అయితే నిజానికి ఆ మూవీ రన్ టైమ్ 3 గంటల 30 నిమిషాలు.

సందీప్ రెడ్డి వంగా తనపై ఉన్న ప్రెజర్ కారణంగా అతి కష్టం మీద సినిమాలో 8 నుంచి 9 నిమిషాల వరకు డ్యూరేషన్ తగ్గించాడు. ఇప్పుడు ఆ కట్ చేసిన సీన్స్ మొత్తాన్ని తిరిగి మూవీలో పెట్టబోతున్నారట. ఆ విషయాన్ని స్వయంగా సందీప్ రెడ్డి వంగానే ప్రకటించాడు. నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న యానమల్ వర్షన్ లో ఈ సీన్స్ కూడా ఉంటాయట. సందీప్ రెడ్డి వంగా అన్ కట్ వర్షన్ ని నెట్ ఫ్లిక్స్ లోకి రిలీజ్ చేయబోతున్నారు. ఈ వార్త విన్న తర్వాత పాన్ ఇండియన్ లెవల్లో ఉన్న ఆడియన్స్ లో మరోసారి యానిమల్ చిత్రం మీద ప్రేమ పుట్టుకొస్తోంది. ఓటీటీ పార్టనర్ నెట్ ఫ్లిక్స్ అనే విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం జనవరి 26న ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాకుండా యానిమల్ సీక్వెల్ ఉన్న విషయం తెలిసిందే. యానిమల్ పార్క్ పేరిట సీక్వెల్ ని ప్లాన్ చేశారు. మరి.. సందీప్ రెడ్డి వంగా అన్ కట్ వర్షన్ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతోంది అన్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet