iDreamPost
android-app
ios-app

రాజమౌళికి కూడా సాధ్యం కానిది సందీప్ వంగా చేసి చూపించాడు!

  • Published Feb 07, 2024 | 4:04 PM Updated Updated Feb 07, 2024 | 4:04 PM

Sandeep Reddy Vanga Creating History: సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతోంది. తాజాగా సందీప్ వంగా అరుదైన రికార్డును నెలకొల్పాడు.

Sandeep Reddy Vanga Creating History: సందీప్ రెడ్డి వంగా పేరు ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మారుమోగుతోంది. తాజాగా సందీప్ వంగా అరుదైన రికార్డును నెలకొల్పాడు.

  • Published Feb 07, 2024 | 4:04 PMUpdated Feb 07, 2024 | 4:04 PM
రాజమౌళికి కూడా సాధ్యం కానిది సందీప్ వంగా చేసి చూపించాడు!

సందీప్ రెడ్డి వంగా.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గురించి ఇప్పుడు తెలుగు ప్రజలు మాత్రమే కాదు.. వారికంటే ఎక్కువగా బాలీవుడ్ సెలబ్రిటీలు మాట్లాడుకుంటున్నారు. ఇతను అడుగు పెట్టిన తర్వాత వారి లెక్కలు మారడం మాత్రమే కాకుండా.. వారి నోటి దురుసు కూడా బాగా తగ్గిపోయింది. గతంలో వాళ్లు ఏం చెప్పినా, ఏం చేసినా అడ్డు లేకుండా ఉండేది. కానీ, ఇప్పుడు సందీప్ సీన్ లోకి వచ్చిన తర్వాత బడా బడా బాబుల పప్పులు కూడా ఉడకడం లేదు. సందీప్ సినిమా గురించి పరోక్షంగా మాట్లాడినా కూడా ఆన్ కెమెరా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ డైరెక్టర్ ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. వాస్తవానికి రాజమౌళికి కూడా సాధ్యం కాని ఫీట్ ని చేసి చూపించాడు.

సందీప్ రెడ్డి వంగా- రణ్ బీర్ కపూర్ కాంబోలో వచ్చిన యానిమల్ చిత్రం థియేటర్లలో క్రియేట్ చేసిన రికార్డులు చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు. సెన్సార్ బోర్డు A సర్టిఫికేట్ ఇచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.900 కోట్లు కలెక్ట్ చేసి విధ్వంసం సృష్టించింది. ఈ సినిమా గురించి సామాన్యులే కాదు.. సెలబ్రిటీలు కూడా డిస్కషన్లు పెట్టారు. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలే కాదు.. మీడియా కూడా సందీప్ రెడ్డి సినిమాపై అక్కసు వెళ్లగక్కింది. అయితే ఎక్కడా కూడా సందీప్ ఆస్కారం ఇవ్వకుండా ప్రతి ఒక్కరికి స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చి పడేస్తున్నాడు. ఈ మూవీ జనవరి 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే.

ఎప్పుడైతే యానిమల్ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టిందో.. అప్పటి నుంచి రికార్డులన్నీ బద్దలు కొట్టడం మొదలు పెట్టింది. స్ట్రీమింగ్ మొదలు పెట్టి రెండు వారాలు కావొస్తున్నా ఇంకా నెట్ ఫ్లిక్స్ ఇండియాలో నంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదండోయ్.. రిలీజ్ అయిన తొలి 10 రోజుల్లోనే 3.93 కోట్ల గంటల వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రెండో వారం కూడా అదే జోరు కొనసాగింది. నెట్ ఫ్లిక్స్ నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ లిస్ట్ లో టాప్ 3 ప్లేస్ ని సొంతం చేసుకుంది. తొలివారంలో అత్యధిక ఫ్యూస్ సొంతం చేసుకున్న సినిమాగా రికార్డులు అన్నీ బద్దలు కొట్టింది. 3.22 నిమిషాలు ఉన్న ఈ మూవీకి 55 లక్షల వ్యూస్ వచ్చినట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా అధికారికంగానే ప్రకటించింది. అంటే 3.93 కోట్ల గంటలు అనమాట.

రాజమౌళి సెన్సేషనల్ మూవీ ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చినప్పుడు మొదటి పది రోజుల్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా రికార్డులు సృష్టించింది. ఆ మూవీకి అప్పుడు 2.55 కోట్ల గంటల వ్యూవర్ షిప్ దక్కింది. అలాగే షారుక్ ఖాన్ జవాన్ చిత్రం కూడా ఇంచు మించు అలాంటి రికార్డునే క్రియేట్ చేసింది. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా సృష్టించిన యానిమల్ మాత్రం ఆ రెండు సినిమా రికార్డులను తుడిచిపెట్టేసింది. ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ఏ సినిమాకి కూడా ఇలాంటి ఒక రికార్డు దక్కలేదు. ఈ మూవీ థియేటర్లలో సృష్టించిన రికార్డులకే అందరూ అల్లాడిపోయారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో క్రియేట్ చేస్తున్న రికార్డులతో కూడా సందీప్ వంగా చాలామందికి మనశ్సాంతి లేకుండా చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. రాజమౌళికి కూడా సాధ్యం కానిది సందీప్ రెడ్డి వంగా చేసి చూపించాడు అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి.. సందీప్ రెడ్డి వంగా యానిమల్ చిత్రం ఓటీటీలో కూడా రికార్డుల మీద రికార్డులు సృష్టించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobet