iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చిన ప్రభాస్ సలార్ మూవీ. ఇప్పుడే చూడొచ్చు.

  • Published Jan 20, 2024 | 7:15 AM Updated Updated Jan 20, 2024 | 11:28 AM

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సలార్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎదురు చూసిన వారు ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చు. మరి ఎంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి.

డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. సలార్ ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తదా అని ఎదురు చూసిన వారు ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూడొచ్చు. మరి ఎంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి.

  • Published Jan 20, 2024 | 7:15 AMUpdated Jan 20, 2024 | 11:28 AM
OTT లోకి వచ్చిన ప్రభాస్ సలార్ మూవీ. ఇప్పుడే చూడొచ్చు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ మూవీ గతేడాది డిసెంబర్ 22న విడుదలైన విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కు ఆడియెన్స్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దేశమంతా సలార్ మానియా కొనసాగింది. చాలా గ్యాప్ తర్వాత డార్లింగ్ ప్రభాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఎప్పటి నుంచో ఆకలి మీదున్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అందించారు ప్రభాస్. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ సలార్ రికార్డు సృష్టించింది. అయితే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం మూవీ లవర్స్ కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. సలార్ ఓటీటీలోకి విడుదలైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

సలార్ మూవీలో ప్రభాస్ యాక్షన్, మాస్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చాయి. క్రిస్మస్ కానుకగా వచ్చిన ఈ మూవీకి ఆడియెన్స్ బ్రహ్మరథం పట్టారు. రికార్డు కలెక్షన్లను వసూల్ చేసి బాక్సాఫీస్ పై సలార్ జెండా పాతింది. ఏకంగా రూ. 700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది సలార్. ఇక ఈ సినిమాను మరోసారి వీక్షించేందుకు ఫ్యాన్స్ తోపాటు సగటు ప్రేక్షకులు కూడా ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ బ్లాక్ బస్టర్ సలార్ మూవీని విడుదల చేసింది. అర్థరాత్రి నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

salaar movie in ott

సలార్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ జనవరి 20వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు నిన్న ప్రకటించింది. ఈ తేదీ నుంచే సలార్ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. 20వ తేదీ అర్థరాత్రి 12 గంటల నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్ అయి ఓటీటీలో సలార్ విడుదల కోసం ఎదురు చూసే వారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌, ఈశ్వరిరావు, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. మరి సలార్ ఓటీటీ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న వారు మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetstarzbetstarzbetStarzbetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş