Tirupathi Rao
Ram Gopal Varma Sapatham Series: రామ్ గోపాల్ వర్మ శపథం విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Ram Gopal Varma Sapatham Series: రామ్ గోపాల్ వర్మ శపథం విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
Tirupathi Rao
రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తాడో అని ప్రేక్షకులు మాత్రమే కాకుండా.. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షం కూడా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది. ఇప్పటికే వ్యూహం సినిమాతో కోలుకోలేని దెబ్బ కొట్టేశాడు. అయితే శపథం సినిమా కూడా క్యూలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. కానీ, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. అదేటంటే.. శపథం ఛాప్టర్ 1, శపథం ఛాప్టర్ 2ని ఏపీ ఫైబర్ నెట్ లో ప్రసారం చేయనున్నారంట. ఈ వార్త వినగానే ఆడియన్స్ ఆనందం వ్యక్తం చేస్తుంటే.. ప్రతిపక్షం మాత్రం నాలుక కరుచుకుంటోంది.
రామ్ గోపాల్ వర్మ వ్యూహం సినిమా ఎన్నిసార్లు వాయిదా పడిందో అందరూ చూశారు. అన్ని వాయిదాల తర్వాత ఎట్టకేలకు థియేటర్లలో విడుదలైంది. కానీ, సెన్సార్ బోర్డ్ కటింగ్స్ వల్ల అనుకున్న సినిమాని అనుకున్నట్లు చూపించలేకపోయారు. అందుకే ముందు నుంచి అనుకున్న ఫార్ములానే అప్లయ్ చేసేందుకు ఆర్జీవీ రెడీ అయిపోయారు. శపథం సిరీస్ ని నేరుగా ఏపీ ఫైబర్ నెట్ ఓటీటీ యాప్ లో పే పర్ వ్యూ కాన్సెప్ట్ లో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. మార్చి 7వ తారీఖు రాత్రి 8 గంటలకు శపథం ఆరంభం ఛాప్టర్ 1ని, మార్చి 8వ తారీఖు రాత్రి 8 గంటలకు శపథం అంతం ఛాప్టర్ 2ని ప్రసారం చేయబోతున్నారు. ఆ తర్వాత ఈ రెండు ఛాప్టర్స్ ని అంచెలంచెలుగా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లోకి విడుదల చేస్తామంటూ రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. అసలు ఈ శపథం ఛాప్టర్ 1, శపథం ఛాప్టర్ 2 సిరీస్లు తీయడానికి కారణం.. ప్రజలకు ఏమీ దాచకుండా పచ్చి నిజాలను తెలిసేలా చేయడమే వ్యూహం- శపథం ఉద్దేశం అన్నారు.