iDreamPost
android-app
ios-app

OTT News: OTTలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. ఈమధ్య చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్​!

  • Published Mar 10, 2024 | 5:59 PM Updated Updated Mar 14, 2024 | 4:06 PM

ఈ మధ్య కాలంలో ఓటీటీలో సినిమాలకు పెరిగిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది.

ఈ మధ్య కాలంలో ఓటీటీలో సినిమాలకు పెరిగిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్ లో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమాలు కూడా ఓటీటీలో మాత్రం దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో సినిమా ఓటీటీలోకి సడన్ ఎంట్రీ ఇచ్చింది.

  • Published Mar 10, 2024 | 5:59 PMUpdated Mar 14, 2024 | 4:06 PM
OTT News: OTTలోకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్.. ఈమధ్య చూడని డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్​!

ఇప్ప్పుడు థియేటర్ లో విడుదలయ్యే సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలకు కూడా అంతే క్రేజ్ ఉంది. పైగా, థియేటర్ లో రిలీజ్ అయినా కొన్ని సినిమాలు .. ఆ సమయంలో యావరేజ్ టాక్ తెచ్చుకున్నా కూడా .. ఒన్స్ ఓటీటీలో అడుగు పెట్టాయంటే మాత్రం.. భారీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. దీనితో మేకర్స్ కూడా ఓటీటీపై మరింత దృష్టిని పెడుతున్నారు. కొన్ని సినిమాలైతే.. థియేటర్ కంటే .. డైరెక్ట్ ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. స్టార్ యాక్టర్స్ సైతం ఈ ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలో థియేటర్ లో విడుదలైన “నరకాసుర” అనే సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పలాస సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ అట్లూరి .. లారీ డ్రైవర్ గా నటించిన చిత్రం “నరకాసుర”. ఈ సినిమాలో అపర్ణ జనార్దన్, సంకీర్తన విపిన్ హీరోయిన్లుగా నటించారు. ఇక ఈ సినిమాకు సెబాస్టియన్ నోవా అకోస్టా జూనియర్.. దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తమిళ్ నాడు సరిహద్దులోని ఓ కాఫీ ఎస్టేట్ నేపధ్యంలో కొనసాగుతోంది. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ, కన్నడ భాషల్లో.. నవంబర్ 3న థియేటర్స్ కలో విడుదలైంది. ఇక ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా.. ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమాను చూడాలంటే మాత్రం రూ.79 చెల్లించాలి.

ఇక నరకాసుర సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా మొత్తం ట్రాన్స్ జెండర్స్ కు సంబంధించి నడుస్తూ ఉంటుంది. చిన్నపుడు దర్శకుడు తప్పిపోతే.. హిజ్రాలే అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించారట. ఇక ఆ నిజ జీవిత సంఘటనను స్ఫూర్తిగా తీసుకుని.. దర్శకుడు ట్రాన్సజెండర్స్ కు సంబంధించిన ఓ సమస్యను.. మూవీలో చూపించాడు. పైగా ఈ సినిమా షూటింగ్ సమయంలో తనకు చేతికి గాయాలైన కూడా.. ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. తిరిగి సినిమాను కంప్లీట్ చేశాడట దర్శకుడు. మరి, సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన “నరకాసుర” సినిమాపై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.