iDreamPost
android-app
ios-app

OTT Movie: డైరెక్ట్ గా OTTలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా.. ట్రైలర్ రిలీజ్

  • Published Mar 11, 2024 | 3:39 PM Updated Updated Mar 14, 2024 | 4:03 PM

థియేటర్ లోనే కాకుండా .. ఓటీటీ లోను డైరెక్ట్ గా కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ నటించిన .. కోర్ట్ డ్రామా చిత్రం పాట్నా శుక్లా డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుంది.

థియేటర్ లోనే కాకుండా .. ఓటీటీ లోను డైరెక్ట్ గా కొన్ని సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టండన్ నటించిన .. కోర్ట్ డ్రామా చిత్రం పాట్నా శుక్లా డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తుంది.

  • Published Mar 11, 2024 | 3:39 PMUpdated Mar 14, 2024 | 4:03 PM
OTT Movie: డైరెక్ట్ గా OTTలోకి వచ్చేస్తున్న థ్రిల్లింగ్ కోర్టు డ్రామా.. ట్రైలర్ రిలీజ్

ఓటీటీలో విడుదలయ్యే సినిమాలన్నిటికి ఇప్పుడు ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటున్నారు. ఈ క్రమంలో థియేటర్ లో విడుదల అయ్యే సినిమాలు కొన్నైతే .. డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అయ్యే సినిమాలు మరి కొన్ని. ఇక ఇప్పుడు కొత్తగా ఓటీటీలోకి మరొక థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా మూవీ రాబోతుంది. బాలీవుడ్ నటి రవీనా టండన్ ఇప్పటికే ఓటీటీలో వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇప్పుడు రవీనా టండన్ నటించిన “పట్నా శుక్లా” మూవీ ఓటీటీలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ ట్రైలర్ ను తాజగా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ మూవీ ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. మరి, ఈ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో .. ఎప్పుడు విడుదల కానుంది అనే వివరాలను తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారం అయ్యే ఆర్యనాక్, కర్మ కాలింగ్ అనే షోలతో ఓటీటీ ప్రేక్షకులకు దగ్గరైంది.. నటి రవీనా టండన్. ఇక ఇప్పుడు ఈ భామ పట్నా శుక్లా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీలో రవీనా ఓ లాయర్ పాత్రలో కనిపించనున్నారు. తన్వీ శుక్లా అనే ఓ హోమ్ మేకర్, పార్ట్ టైమ్ లాయర్ గా రవీనా.. ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. బీహార్ లో జరిగిన ఓ ఎడ్యుకేషన్ స్కామ్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. విద్యా వ్యవస్థలోని పెద్ద స్కామ్స్ చుట్టూ తిరిగే ఈ సినిమా ట్రైలర్.. ప్రేక్షకులకు చాలా ఆసక్తికరంగా మారింది. ఈ మూవీ ట్రైలర్ తోనే అసలు ఈ సినిమాలో ఏం ఉండబోతుంది అనే విషయాన్నీ క్లియర్ గా చెప్పేసినట్లు చూపించారు. ఈ మూవీని ప్రముఖ ఆన్ లైన్ ప్లాట్ ఫార్మ్ హాట్ స్టార్ లో .. మార్చి 29 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

ఇక పట్నా శుక్లా మూవీ ట్రైలర్ విషయానికొస్తే.. స్టూడెంట్స్ మార్క్స్ ను తారుమారు చేస్తూ.. వారి జీవితాలతో చెలగాటమాడే ఓ స్కామ్ పై.. తన్వీ శుక్లా అనే మహిళా లాయర్ చేసిన పోరాటమే ఈ మూవీ కథ. ఈ క్రమంలో ఆమె, ఆమె కుటుంబం ఎదుర్కొనే సవాళ్లను ట్రైలర్ లో చూపించారు. ఒక గృహిణిగా రుచికరమైన వంటలు చేయడంతో పాటు.. ఆమె ఒక లాయర్ కూడా అంటూ .. తన్వీ శుక్లా క్యారెక్టర్ పరిచయం అవుతుంది. కానీ, ఆమె భర్త మాత్రం ఏవో చిన్న చిన్న కేసులే వస్తున్నాయంటూ.. ఆమెను తక్కువ చేసి మాట్లాడతాడు. ఇలా ఉన్న క్రమంలో ఈ లాయర్ దగ్గరకి ఓ పెద్ద ఎడ్యుకేషన్ స్కామ్ కు సంబంధించిన కేసు వస్తుంది. తనకు 60% రావాల్సిన మార్క్స్ లో 30% మాత్రమే వేసి తనని ఫెయిల్ చేశారని ఒక అమ్మాయి.. ఈ లాయర్ దగ్గరకు వస్తుంది.

ఈ కేసు టెక్ ఓవర్ చేసిన ఈ లాయర్ కు దాని వెనుక ఉన్న.. భారీ స్కామ్ లు బయట పడతాయి. దాని వెనుక పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఉంటారు. దీనితో ఈ కేసు వదులుకోవాలని ఆమెపై ఒత్తిడి తీసుకుని వస్తారు. అయినా ఆమె ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. ఈ కేసుపై పోరాటం కొనసాగిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది అన్నదే ఈ సినిమా కథ. ఎడ్యుకేషన్ పరంగా ఈ సినిమా ఉండడంతో .. ఇంకాస్త ఆసక్తిగా ఈ సినిమా అందరిని ఆకట్టుకోనుందని చెప్పవచ్చు. ఇక పట్నా శుక్లా సినిమా మార్చి 29 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కానుంది. మరి, ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetKavbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişelexbet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/galabetcasibomholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş