Veeranjaneyulu Vihara Yatra Telugu Movie OTT Review: వీరాంజనేయులు విహార యాత్ర మూవీ OTT రివ్యూ.. ఈటీవీ విన్ లో కామెడీ ఎంటర్టైనర్

వీరాంజనేయులు విహార యాత్ర మూవీ OTT రివ్యూ.. ఈటీవీ విన్ లో కామెడీ ఎంటర్టైనర్

Veeranjaneyulu Vihara Yatra Telugu Movie OTT Review: ప్రతి వారం ఓటీటీ లో ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం కూడా.. ప్రేక్షకులను నవ్వించేందుకు 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

Veeranjaneyulu Vihara Yatra Telugu Movie OTT Review: ప్రతి వారం ఓటీటీ లో ఎదో ఒక కామెడీ మూవీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఈ వారం కూడా.. ప్రేక్షకులను నవ్వించేందుకు 'వీరాంజనేయులు విహార యాత్ర' అనే తెలుగు కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు.. సరికొత్త కథతో ఇంట్రెస్టింగ్ కామెడీ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇప్పటికే ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ను అందించడంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ ముందుంటుందన్న సంగతి.. #90’s వెబ్ సిరీస్ తో ప్రూవ్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ‘వీరాంజనేయులు విహార యాత్ర’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చింది. ఆగష్టు 14 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. కాగా ఈ సినిమాలో నరేష్, రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రల్లో నటించగా.. అనురాగ్‌ పాలుట్ల దర్శకత్వం వహించారు. మరి ఈ సిరీస్ ఎలా ఉందో రివ్యూ లో చూసేద్దాం.

కథ:

ఈ సినిమాలో 1962 లో వీరాంజనేయులు (బ్రహ్మానందం) రైల్వే ఉద్యోగిగా పని చేసి.. రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బుతో… గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. ఆ ఇంటి పేరు హ్యాపీ హోమ్. ఇక వీరాంజనేయులు మరణించిన తర్వాత ఆ కుటుంబం బాధ్యత అంత తన కొడుకు నాగేశ్వరరావు ( నరేష్ ) మీద పడుతుంది. నాగేశ్వరరావు ఒక పాఠశాలలో 30 ఏళ్లుగా లెక్కల టీచర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే అతనికి సరిగా ఇంగ్లీష్ రాకపోవడంతో.. అతని జాబ్ పోతుంది. సరిగ్గా అదే సమయంలో అతని కూతురు సరయు (ప్రియా వడ్లమాని) పెళ్ళి కుదురుతుంది. అది ప్రేమ వివాహం కావడంతో .. అబ్బాయి తరపు వారు పెళ్లికి ఒప్పుకుంటారు కానీ.. పెళ్లి మాత్రం ఘనంగా చేయాలనే కండిషన్ పెడతారు. దానికి నాగేశ్వరరావు ఒప్పుకుంటాడు. కానీ అప్పుడే ఉద్యోగం పోవడంతో చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదు.. దీనితో ఎలా అయినా గోవాలో తన తండ్రి కట్టిన ఇంటిని అమ్మేసి.. ఆ డబ్బుతో కూతురు పెళ్ళి చేయాలనీ డిసైడ్ అవుతాడు. కానీ ఈ విషయం డైరెక్ట్ గా ఇంట్లో చెప్పకుండా.. తన తండ్రి అస్థికలు గోవాలోని సముద్రంలో కలపడం.. తన తండ్రి చివరి కోరికగా ఓ ఉత్తరం రాసినట్లు అందరిని నమ్మిస్తాడు. ఇక ఫ్యామిలీ అంతా కలిసి గోవా బయల్దేరతారు. ఈ క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి ? నాగేశ్వరరావు అబ్బాయి(రాగ్ మయూర్) , అమ్మాయి మధ్య జరిగిన గొడవ ఏంటి ? నాగేశ్వరరావు దాచిన విషయం తెలిసిన తర్వాత.. అతని కుటుంబం ఎలా రియాక్ట్ అయింది ? చివరికి కథ ఎలా ముగిసింది ? అనేది తెరపై చూడాల్సిన కథ.

విశ్లేషణ:

మిడిల్ క్లాస్ కుటుంబాలలో ఉండే ఎమోషన్స్ ను స్క్రీన్ పైన చూపిస్తే.. ప్రతి ఒక్కరు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ అదే స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి. అందులోను మిడిల్ క్లాస్ నాన్న సెంటిమెంట్ ఎప్పటికి బోర్ కొట్టని ఒక స్వీట్ ఎమోషన్. తనకున్న చాలీ చాలని జీతంతోనే కుటుంబ బంధాలను బాధ్యతలను.. నిర్వర్తించడంలో నాన్న పాత్ర ఎంత ఉంటుందో అందరికి తెలిసిందే. సరిగా ఇదే కాన్సెప్ట్ తో కథను తెరపై చూపించడంలో.. దర్శకుడు సక్సెస్ అయ్యాడని చెప్పి తీరాలి. ఇక సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ విషయానికొస్తే.. గోవా.. కనీసం లైఫ్ లో ఓసారైన ఫ్రెండ్స్ తో కలిసి గోవా వెళ్లి ఎంజాయ్ చేయాలని అందరికి ఓ చిన్న డ్రీమ్ ఉంటుంది. కానీ అలాంటి టూరిస్ట్ ప్లేస్ లో అస్థికలు కలపడానికి వెళ్లడం అనే పాయింట్ అందరిని నవ్వించేస్తుందని.. భావిస్తారు కానీ.. ఆశించిన స్థాయిలో కామెడీ యాంగిల్ మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు.

కథలో కొత్తదనం , కామెడీకి స్కోప్ ఉన్నా కూడా అవి తెరపై చూపించిన తీరు ఆశించిన విధంగా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక అంతగా చెప్పుకోదగిన ట్విస్ట్ లు , సర్ప్రైజ్ ఎలిమెంట్స్ కూడా లేవు. ప్రేక్షకుల ఊహాగానాలకు తగినట్లే సినిమా కథ కొనసాగుతుంది. ఇక మొదట పిల్లలు తల్లి తండ్రులను అపార్థం చేసుకోవడం.. ఆ తర్వాత తండ్రి కష్టం తెలుసుకుని.. అర్ధం చేసుకోవడం లాంటి సీన్స్ ఇప్పటికే చాలా సినిమాలలో చూసేసి ఉంటారు. సరిగ్గా అలాగే ఈ సినిమాలో కూడా క్లైమాక్స్ లో కొన్ని ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను భావోద్వేగాగానికి గురి చేస్తాయి. సినిమా మొత్తం మీద అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

నటీనటులు – టెక్నికల్ పని తీరు:

ఒక మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో నరేష్ తనదైన నాగేశ్వరరావు పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఇప్పటివరకు నరేష్ కెరీర్ లో చేసిన సినిమాలలోని క్యారెక్టర్స్ లో.. ఈ క్యారెక్టర్ బెస్ట్ అని చెప్పి తీరాలి. ఇక ఆ తర్వాత సినిమాలో ఆ రేంజ్ లో క్యారక్టర్ కు న్యాయం చేసిందంటే.. నరేష్ కొడుకు పాత్రలో నటించిన రాగ్ మయూర్ అని చెప్పి తీరాలి. వీరిద్దరితో పాటు సరయు పాత్రలో నటించిన ప్రియ వడ్లమాని కూడా సహజ నటనతో మెప్పించింది. అలాగే బామ్మ పాత్రలో శ్రీ లక్ష్మి అందరికి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. వీరితో పాటు మిగిలిన నటి నటులు కూడా తన సహజ నటనతో … బాగానే మెప్పించారు. కథలో కొత్తదనం ఉన్న కూడా కామెడీ సరిగా వర్క్ అవుట్ కాకపోడం మైనస్. ఇక బ్రహ్మానందం స్క్రీన్ పైన కనిపించలేదు కానీ.. ఆయన వాయిస్ తో సినిమాలో ఉన్నారనే ఫీల్ మాత్రం అందరికి కలుగుతుంది. సినిమా నిడివి రెండు గంటలే అయినా కూడా.. కాస్త లాగ్ ఉండడంతో ఎక్కువ సేపు చూశాం అనే ఫీలింగ్ వస్తుంది.

బలాలు:

  • నటీనటుల యాక్టింగ్
  • సంగీతం
  • కథ

బలహీనతలు:

  • ఊహించినట్లు సాగే సన్నివేశాలు
  • ఎమోషనల్ సీన్స్( కొన్ని )

చివరిగా : ఎమోషనల్ , ఫన్ ఎలిమెంట్స్ తో సాగే విహార యాత్ర.. వీరాంజనేయులు విహార యాత్ర

రేటింగ్ : 2/5

(*గమనిక: ఈ రివ్యూ సమీక్షకుని వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments