Hot Spot Review: Hot Spot మూవీ రివ్యూ.. రోత కొట్టుడుకి భిన్నంగా

Hot Spot Review.. రోటీన్‌కు భిన్నంగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. కొత్త కథలను చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు అలాంటి మూవీనే ఓటీటీలో సందడి చేస్తుంది. అదే హాట్ స్పాట్. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చదవండి.

Hot Spot Review.. రోటీన్‌కు భిన్నంగా కొన్ని సినిమాలు వస్తున్నాయి. కొత్త కథలను చాలా చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు దర్శకులు. ఇప్పుడు అలాంటి మూవీనే ఓటీటీలో సందడి చేస్తుంది. అదే హాట్ స్పాట్. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ చదవండి.

ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ సరికొత్త కథలతో సినిమాలు తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నారు. తాము అనుకున్నది అనుకున్న విధంగా స్క్రీన్ పై ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అవుతున్నారు. ఆ దర్శకుల్లో ఒకరు విఘ్నేశ్ కార్తీక్. బుల్లితెర యాంకర్, రేడియో జాకీ నుండి నటుడు ఆపై ఫిల్మ్ డైరెక్టర్ అయ్యాడు. మూడు చిత్రాలను తెరకెక్కించిన ఈ దర్శకుడు ఈ ఏడాది హాట్ స్పాట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మార్చి 29న విడుదలైన ఈ మూవీ ఇటీవల కాలంలో ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తుంది. గౌరీ జి కిషన్, శాండీ, ఆదిత్య భాస్కర్, అమ్ము అభిరామి, జనని, సుభాష్, సోఫియా, కళయరాసన్ తదితరులు నటించారు. ఇది నాలుగు కథల సమ్మోళనం. ఆంధాలజీ మూవీగా తెరకెక్కిన హాట్ స్పాట్ ఎలా ఉందో ఈ రివ్యూ చదవండి.

కథ

హారర్, యాక్షన్, లవ్ స్టోరీస్ కథలు విని విసిపోగుతుంటాడు ఓ నిర్మాత. ఆ సమయంలో స్టోరీ వినిపించేందుకు వస్తాడు మహ్మద్ షఫీ (విఘ్నేశ్ కార్తీక్). 10 నిమిషాలే టైం ఇచ్చి కథ చెప్పమంటాడు. కానీ ఓ ట్విస్ట్ ఇవ్వడంతో షఫీ చెప్పే స్టోరీలు వినేందుకు ఆసక్తి చూపుతాడు.  ఆ నాలుగు స్టోరీలే.. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, గోల్డెన్ రూల్స్, తక్కాయి చట్నీ (టమాటా చట్నీ), ఫేమ్ గేమ్. ఈ ఆంధాలజీ మూవీలో నాలుగు నాలుగు డిఫరెంట్ స్టోరీస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్.. మన జంబలకడి పంబను తలపిస్తే.. గోల్డెన్ రూల్స్.. ఇద్దరు ప్రేమికులకు ఊహించని విషయం తెలుస్తుంది. ఇక టమాటా చట్నీ.. కాస్తంత రొమాంటిక్ యాంగిల్లో తెరకెక్కుతుంది. నాలుగు ఫేమ్ గేమ్ ఇది మనస్సులను తడి చేస్తుంది. ఆలోచనాత్మకంగా ఉంది. ఈ నాలుగు స్టోరీలు రోటిన్‌కు భిన్నంగా ఉంటాయి. ఆ స్టోరీలు ఏంటీ..? మరీ ఈ నిర్మాతకు ఎందుకు చెప్పాడు..? అతనికి నచ్చాయా లేదా అంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

నిర్మాత అన్నట్లుగా చాలా డిఫరెంట్ కాన్సెప్టులతో మూవీ తెరకెక్కింది. తమిళంలో ఏ మేరకు ఆకట్టుకుందో తెలియదు కానీ.. వర్సటాలిటీని ఇష్టపడే తెలుగు ఆడియన్స్ కు మాత్రం తెగ నచ్చేస్తుంది. ప్రతి కథలోనూ అంతర్లీనంగా సందేశం దాగి ఉంది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్‌లో ప్రతి అమ్మాయి పుట్టింటిని ఎందుకు వదిలి ఉండాలన్న ప్రశ్న లెవనెత్తితే.. గోల్లెన్ రూల్స్‌లో ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమించుకుంటే.. పెద్దల జోక్యంతో వీరి రిలేషన్ మారిపోతుంది. టమాటో చట్నీలో ప్రేమ వేరు కామం వేరు అని అబ్బాయి చెప్పే ఫిలాసఫీకి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తుంది ప్రియురాలు. ఇక లాస్ట్.. బట్ నాట్ లీస్ట్.  నాలుగో స్టోరీ ఆలోచనాత్మకంగా ఉంటుంది. ఈ రోజుల్లో నేమ్ ఫేమ్ కోసం పిలల్ల్ని పావులుగా చేయడాన్ని చూపించారు. ఈ కథ నిజంగా మెలితిప్పేస్తుంటుంది. నిజంగా ఈ నాలుగు కథలు రియల్లీ డైమండ్స్. ఒక్కో కథను సరైన స్క్రీన్ ప్లే రాసుకుంటే..ఫోర్ స్టోరీస్ అయ్యేవేమో బహుశా అనిపించకమానదు.

నటీనటులు ఎలా చేశారంటే..

కథకు తగ్గట్లుగా పాత్రను డిజైన్ చేశాడు దర్శకుడు విఘ్నేశ్ కార్తీక్. ఇందులో తాను యంగ్ డైరెక్టర్‌గా కనిపిస్తాడు. 96 మూవీలో జత కట్టిన జోడీ ఇందులో కూడా మెప్పించింది. గౌరీ జి కిషన్ ధన్య పాత్రలో మెప్పించింది. ఆమెకు జోడీగా నటించాడు ఆదిత్య భాస్కర్. ఇందులో ఇతడి ఫెర్ఫామెన్స్ అలా గుర్తిండిపోతుంది. ఇక లియోతో ఫేమస్ అయిన డ్యాన్స్ మాస్టర్ శాండీ ఉన్నది కాసేపే అయినా.. బాగా నటించాడు. అమ్ము అభిరామి కూడా ఓకే అనిపిస్తుంది. జర్నలిస్టు పాత్రలో జనని, సుభాష్ పాత్రలో వెట్రి నటించారు. వెట్రి క్యారెక్టర్.. అతడు పడే సంఘర్షణ బాగుంటుంది. లక్ష్మీగా సోఫియా కన్నా.. యుజుమలై పాత్రలో కళారాసన్.. కంటతడి పెట్టిస్తాడు. మిగిలిన టెక్నికల్ వ్యాల్యూస్ బాగున్నాయి. సంగీతం కూడా యాప్ట్ అయ్యింది. చూడటానికి చాలా నీట్‌గా ఉంది.

 

చివరి మాట: హాట్ స్పాట్.. రోటీన్‌కు భిన్నంగా

Show comments