iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. GOTని గుర్తు చేస్తూ..

  • Published Mar 09, 2024 | 3:59 PM Updated Updated Mar 09, 2024 | 3:59 PM

OTT New Releases: యాక్షన్ చిత్రం అనగానే అందరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటారు. అలాంటి ఒక రిఫరెన్స్ తో ఇప్పుడు హాలీవుడ్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

OTT New Releases: యాక్షన్ చిత్రం అనగానే అందరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంటారు. అలాంటి ఒక రిఫరెన్స్ తో ఇప్పుడు హాలీవుడ్ ఫాంటసీ యాక్షన్ చిత్రం ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

  • Published Mar 09, 2024 | 3:59 PMUpdated Mar 09, 2024 | 3:59 PM
OTTలోకి వచ్చేసిన హాలీవుడ్ యాక్షన్ చిత్రం.. GOTని గుర్తు చేస్తూ..

యాక్షన్ చిత్రాలు అంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. వందలో 90 మంది సినిమా లవర్స్ యాక్షన్ చిత్రాలకే ఓటేస్తారు. వాటిలో కూడా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్స్ అంటే పడి చచ్చిపోతారు. అలాంటి ఒక సినిమా వస్తే వదలకుండా చూసేస్తారు. అలాంటి మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది అంటే వదలుతారా? ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు కూడా అదే చేస్తున్నారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహా ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఒకటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేముంది మూవీ లవర్స్ ఆల్రెడీ ఆ మూవీని ట్రెండ్ చేసేస్తున్నారు కూడా. మరి.. ఆ మూవీ ఏదీ? అంత స్పెషల్ ఎందుకో చూద్దాం.

సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు ఇష్టపడేవారికి గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ యాక్షన్ వెబ్ సిరీస్ లో రాజ్యాలు, రాజులు, గుర్రాలు మాత్రమే కాకుండా తోడేళ్లు, డ్రాగన్స్ కూడా ఉంటాయి. ఈ సిరీస్ లో ఒక్కో సీన్ గూస్ బంప్స్ తెప్పిస్తూ ఉంటుంది. ఆ సినిమా తర్వాత డ్రాగన్ బ్యాగ్రాడ్ లో సినిమాలు రావడం అరుదుగా మారిపోయింది. ఇప్పుడు డామ్ సెల్ అంటూ హాలీవుడ్ లో ఒక ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ వచ్చేసింది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు జీవోటీ రిఫరెన్సులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో కూడా ఒక డ్రాగన్ థీమ్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. డ్రాగన్ దగ్గర దొంగతనానికి వెళ్తారు. ఆ సీన్ లో ఉన్న థ్రిల్ మీకు ఈ డామ్ సెల్ సినిమాలో కనిపిస్తుంది.

ఆ డామ్ సెల్ కూడా దాదాపుగా అలాంటి ఒక వర్షన్ లోనే వస్తోంది. ఇందులో కూడా హీరోయిన్ డ్రాగన్ దగ్గరి నుంచి తన ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంతో పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ మూవీలో హీరోయిన్ పోరాటం చూస్తే.. 2022లో వచ్చిన ది ప్రిన్సెస్ మూవీ కూడా గుర్తొస్తుంది. ఒక యువరాణి తన కోటలోనే శత్రువులకు కనిపించకుండా వారిపై యుద్ధం చేస్తూ ఉంటుంది. అలాగే ఈ మూవీలో డ్రాగన్ పై హీరోయిన్ తన ప్రాణాల కోసం పోరాటం చేస్తూ ఉంటుంది. ఇదంతా కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఒక రకంగా యువరాణిని పెళ్లి పేరుతో బలిస్తారు. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో యువరాణిగా హీరోయిన్ ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటుంది. పెళ్లి పేరుతో ఒక రాజ్యం వచ్చి మంచి వాళ్లలా నటిస్తూ యువరాణిని పెళ్లాడి తీసుకెళ్తారు. అలా వాళ్లు తీసుకెళ్లింది వారి ఆచారం ప్రకారం డ్రాగన్ కు బలి ఇవ్వడానికి.

వారి కుట్ర తెలియక హీరోయిన్ ప్రిన్స్ ఎలోడీ(మిల్లీ బాబీ బ్రౌన్) ఎన్నో ఆశలు పెట్టుకుని అత్తగారింటికి వెళ్తుంది. వెళ్లిన కాసేపటికే ఆమెను ఒక పూజ చేసి వారి కోటలో ఉన్న పెద్ద సొరంగంలో పడేస్తారు. ఆమె అక్కడి స్పృహ తప్పి పడిపోతుంది. లేచి చూస్తే ఆమె ఎక్కడో ఉందో కూడా తెలియదు. అక్కడ ఎదురుగా ఒక పెద్ద డ్రాగన్ ఉంటుంది. అది నోటి నుంచి నిప్పులు కక్కుతూ ఆమెను చంపేందుకు చూస్తూ ఉంటుంది. ఆ డ్రాగన్ దగ్గరి నుంచి తప్పించుకుని ఇలాంటి అన్యాయం మరో అమ్మాయికి జరగకుండా చేసిందా? అసలు తన ప్రాణాలను ఎలాకాపాడుకుంది? అనేదే ఈ కథ. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచికూడా మంచి రివ్యూస్ అందాయి. మరి.. డామ్ సెల్ చిత్రాన్ని మీరు చూడాలి అనుకుంటున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetjolly girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş