Swetha
GOAT Movie OTT Partner : విజయ్ దళపతి నటించిన గోట్ మూవీ భారీ అంచనాల మధ్యన.. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ బజ్ వినిపించేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
GOAT Movie OTT Partner : విజయ్ దళపతి నటించిన గోట్ మూవీ భారీ అంచనాల మధ్యన.. సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ఈ క్రమంలో అప్పుడే ఈ సినిమా ఓటీటీ బజ్ వినిపించేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
విజయ్ దళపతి నటించం లేటెస్ట్ మూవీ.. గోట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అయింది. వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. విజయ్ కెరీర్ లోనే ఈ మూవీ ఆఖరి మూవీ అంటూ.. బాగా ప్రచారం జరగడంతో.. ఈ మూవీ పై అందరికి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు విజయ్ అభిమానులు. ఇక ప్రస్తుతం ఈ సినిమా థియేటర్స్ లో మిక్స్డ్ టాక్ తో నడుస్తుంది. ఇక అప్పుడే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ బజ్ వినిపించేస్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు పెరిగే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనితో కొన్ని సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాకముందే ఓటీటీ డీల్ కుదుర్చుకుంటుంటే.. కొన్ని సినిమా థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీ డీల్ ను క్లోజ్ చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో విజయ్ దళపతి గోట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం. పైగా ఈ సినిమాను అక్టోబర్ 2 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసురానున్నట్లు కూడా టాక్ వినిపిస్తుంది. ఇప్పుడు ఎలాగూ థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ నెలలోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. కాబట్టి ఈ సినిమా అదే తేదికి ఓటీటీ లోకి వచ్చిన ఆశ్చర్యం లేదు. థియేట్రికల్ రన్ పూర్తైన తర్వాత స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
పైగా ఈ సినిమా ఓటీటీ బజ్ విషయంలో వినిపిస్తున్న ఇంకొక బజ్ ఏంటంటే… థియేటర్ లో మూడు గంటల 2 నిమిషాల నిడివితో రన్ అవుతున్న ఈ సినిమాను.. ఓటీటీ లో మరిన్ని యాక్షన్ సీన్స్ యాడ్ చేసి.. పూర్తి నిడివి అంటే 3 గంటల 20 నిమిషాలతో స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారట. విజయ్ అభిమానులకు ఇది ఇంకాస్త కిక్ ఇస్తుందని చెప్పి తీరాల్సిందే. ఇక ఈ మూవీలో విజయ్ తో పాటు సీనియర్ హీరోయిన్ స్నేహా, మీనాక్షి చౌదరి, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, అజ్మల్ అమీర్, జయరామ్, లైలా, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ ప్రధాన పాత్రలలో నటించారు. ప్రస్తుతానికి మిక్స్డ్ టాక్ తో కొనసాగుతున్న ఈ మూవీ.. లాంగ్ రన్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాలి. మరి ఈ మూవీ ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.