iDreamPost

Maharaja Movie OTT: విజయ్ సేతుపతి మహారాజ మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్

  • Published Jun 05, 2024 | 5:59 PMUpdated Jun 05, 2024 | 5:59 PM

సినిమాలు థియేటర్స్ కు రాకముందే.. ఆయా సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఈ లిస్ట్ లోకి యాడ్ అయింది.

సినిమాలు థియేటర్స్ కు రాకముందే.. ఆయా సినిమాలకు సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డీటెయిల్స్ వచేస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరొక సినిమా ఈ లిస్ట్ లోకి యాడ్ అయింది.

  • Published Jun 05, 2024 | 5:59 PMUpdated Jun 05, 2024 | 5:59 PM
Maharaja Movie OTT: విజయ్ సేతుపతి మహారాజ మూవీ OTT పార్ట్నర్  ఫిక్స్

థియేటర్ లో ఎప్పుడెప్పుడు ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులు .. ఇప్పుడు ఇంకా సినిమాలు థియేటర్ లో రిలీజ్ కాకముందే ఇంకా ఏ ఓటీటీ లోకి వస్తాయో కూడా సెర్చ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే థియేటర్ రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలకు సంబంధించిన ఓటీటీ అప్ డేట్స్ ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాము. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో మూవీ యాడ్ అయింది. విజయ్ సేతుపతి మెయిన్ లీడ్ లో నటిస్తున్న.. “మహారాజ” మూవీ ప్రస్తుతం థియేటర్ రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈలోపే ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు సమాచారం. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో.. ఈ సినిమాపై అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి.. ఈ సినిమాలో తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా విజయ్ సేతుపతి ఇది 50 వ చిత్రం కావడంతో.. ఈ సినిమాపై మరిన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను జూన్ 14 న తమిళంలో థియేటర్ లో రిలీజ్ చేయనున్నారు మేకర్స్. తెలుగులో కూడా ఈ సినిమా వస్తుంది అనే టాక్ అయితే నడుస్తుంది. కానీ, ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ లోపే ఈ సినిమా డిజిటల్ హక్కలు కూడా భారీగా అమ్ముడు పోయినట్లు టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్ రిలీజ్ తర్వాత ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ బయటకు వస్తుంది.

ఇక ఈ సినిమా ట్రైలర్ విషయానికొస్తే.. ఎప్పటిలానే విజయ్ సేతుపతి తన మార్క్ ను చూపించారు. ఈ సినిమాలో విజయ్ ఒక సెలూన్ షాప్ నడుపుతూ ఉంటాడు. ఈ మూవీ ట్రైలర్ స్టార్టింగ్ లో .. విజయ్ .. తన పేరు మహారాజ అని.. తన ఇంట్లో ఉన్న లక్ష్మిని దొంగలించారంటూ పోలీస్ స్టేషన్ కు విజయ్ సేతుపతి వెళ్లడంతో ఈ మూవీ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అయితే మహాలక్ష్మి ఏంటి అనేది మాత్రం ఎవరికీ తెలీదు. లక్ష్మి అంటే మనిషా , డబ్బా , డాక్యుమెంట్స్ ఆ అనేది మాత్రం సస్పెన్స్. ఇలా సస్పెన్స్ కోణంలో ఉండే విజువల్స్ అన్ని కూడా ఈ మూవీ లో మనం చూడొచ్చు. వెట్రిమారన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో వేచి చూడాలి. మరి “మహారాజ” సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి