OTT లో తెలుగులోకి వచ్చేసిన విజయ్ ఆంటోని ‘తుఫాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

Telugu Spy Action Thriller Toofan Movie OTT Streaming Details: థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ వీలైనంత త్వరగా ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

Telugu Spy Action Thriller Toofan Movie OTT Streaming Details: థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ వీలైనంత త్వరగా ఓటీటీ లో అడుగుపెడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ మూవీ తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ప్రస్తుతం ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలో ఆల్రెడీ ఒరిజినల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినా సినిమాలను.. మళ్ళీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ కు తీసుకుని వస్తున్నారు మేకర్స్. అలా ఈ వారం రెండో మూడో సినిమాల తెలుగు వెర్షన్స్ ఓటీటీ లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలో థియేటర్ లో రిలీజ్ అయినా వారం రోజులకే ఓటీటీ లోకి వచ్చిన విజయ్ ఆంటోని.. మూవీ తెలుగు వెర్షన్ ను ఇప్పుడు.. ఓటీటీ లో అందుబాటులోకి తీసుకుంఇ వచ్చారు. మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ మూవీ తమిళంలో విజయ్ ఆంటోని నటించిన మ‌జై పిడిక్కాథ మ‌ణితాన్.. ఈ మూవీ ఆగస్ట్ 2న థియేటర్ లో రిలీజ్ అయింది కానీ ఆ ప్రేక్షకులను మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ఇక తమిళ్ వెర్షన్ రిలీజ్ అయినా 10 రోజుల తర్వాత.. ఆగస్ట్ 11 న అదే మూవీ ‘తుఫాన్’ పేరుతో రిలీజ్ చేసారు మేకర్స్ . తెలుగులో కూడా ఈ మూవీ ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. దీనితో తెలుగు వెర్షన్ థియేటర్ లో రిలీజ్ అయినా వారం వ్యవధిలోనే.. ఈ మూవీ తమిళ వెర్షన్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆగస్ట్ 22 నుంచి తమిళంతో పాటు.. తెలుగు , కన్నడ , మలయాళం భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చారు. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో.. ఈ సినిమాను కూడా యాడ్ చేసుకుని.. ఎంచక్కా ఎంజాయ్ చేసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో ఒక సీక్రెట్ ఏజెంట్.. అతని వృత్తిలో భాగంగా ఓసారి అండమాన్ దీవులలో ఓ ఊరికి వెళ్లాల్సి వస్తుంది. అయితే ఆ ఊరిలో డాలి అనే ఓ వడ్డీ వ్యాపారి ఆ ఊరి ప్రజల మీద పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. ఇదిలా కొనసాగుతూ ఉండగా.. ఆ ఊరికి వెళ్లిన హీరోకు.. అక్కడే ఉంటున్న హీరోయిన్ తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. అలాగే అక్కడ హీరోకు అనుకోని పరిస్థితులు ఎదురౌతూ ఉంటాయి. డాలి నుంచి అక్కడి ప్రజలను ఎలా అయినా కాపాడాలని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అతను చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ ఏంటి ? అక్కడి ప్రజలను అతను ఎలా కాపాడాలనుకున్నాడు అనేది మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments