iDreamPost
android-app
ios-app

OTT లోకి వరుణ్ సందేశ్ ‘విరాజి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

  • Published Aug 20, 2024 | 10:35 AM Updated Updated Aug 20, 2024 | 12:26 PM

Telugu Suspense Thriller Viraji Movie OTT Details: ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇప్ప్పుడు ఆ లిస్ట్ లో యాడ్ అవ్వడానికి మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Telugu Suspense Thriller Viraji Movie OTT Details: ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాల లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇప్ప్పుడు ఆ లిస్ట్ లో యాడ్ అవ్వడానికి మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Aug 20, 2024 | 10:35 AMUpdated Aug 20, 2024 | 12:26 PM
OTT లోకి వరుణ్ సందేశ్ ‘విరాజి’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. అయితే వాటిలో ఈ మధ్య తెలుగు సినిమాలకు డిమాండ్ బాగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ప్రతి వారం ఓటీటీ లో కొత్త సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ వారం కూడా ఓ ఇంట్రెస్టింగ్ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ యాడ్ అవ్వబోతుంది. అదే టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన ‘విరాజి’. థియేటర్ లో విడుదలైన ఇరవై రోజులలోపే ఈ సినిమా ఓటీటీ లోకి రావడం విశేషం. మరి ఈ సినిమా ఎక్కడ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కాబోతుంది అనే విషయాలను చూసేద్దాం.

టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ ఖాతాలో మంచి హిట్ పడి.. చాలా కాలమే అయింది. ఈ క్రమంలో నెల వ్యవధిలోనే వరుణ్ సందేశ్ చేసిన రెండు సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయ్యాయి. వాటిలో ఒకటి ‘నింద’ సినిమా… ఆల్రెడీ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఆగస్ట్ 2 ‘విరాజి’ సినిమా థియేటర్ లో రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా గురించి మాత్రం అంతగా టాక్ వినిపించలేదు. ఈ మధ్య ఎలాగూ థియేటర్ లో మెప్పించని సినిమాలు ఓటీటీ లో ఆకట్టుకుంటున్నాయి.. కాబట్టి ఈ సినిమాను కూడా త్వరగానే ఓటీటీ లోకి తీసుకుని వస్తున్నారు మేకర్స్. కాగా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకుంది. ఇక “చుట్టూ పిచ్చి ప్రపంచం. బయటపడతాడా, భయపెడతాడా? విరాజి ఆగస్ట్ 22న మీ ఆహాలో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్ . కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో.. ఈ సినిమాను కూడా యాడ్ చేసుకుని ఎంచక్కా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి కొంతమంది వ్యక్తులను ఒక కొండపైన ఉన్న.. మెంటల్ హాస్పిటల్ కు రమ్మని చెప్తాడు. తీరా వీరంతా అక్కడికి వెళ్లిన తర్వాత అతను వీరిని మోసం చేసాడని తెలుస్తుంది. అక్కడికి వెళ్లిన తర్వాత వారిలో ఒకరిని ఆ గుర్తు తెలియని వ్యక్తి చంపేస్తాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు ? ఎందుకు వీరిని ఆ కొండపైకి రమ్మని చెప్తాడు ? ఎందుకు వారిని చంపేస్తాడు ? మిగిలిన వారు తప్పించుకున్నారా లేదా ? తర్వాత ఏం జరిగింది ? అనేదే ఈ మూవీ కథ. మరి ఓటీటీ ప్రేక్షకులను ఈ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş