Swetha
Nindha Movie OTT Streaming Date: ఓటీటీ లో కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అలంటి సినిమాల లిస్ట్ లో వరుణ్ సందేశ్ నటించిన నింద మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్
Nindha Movie OTT Streaming Date: ఓటీటీ లో కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల లోపే వస్తుంటే కొన్ని సినిమాలు మాత్రం.. ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అలంటి సినిమాల లిస్ట్ లో వరుణ్ సందేశ్ నటించిన నింద మూవీ కూడా యాడ్ అయింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్
Swetha
ఇప్పుడు ఎవరు చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీల వైపే చూస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా కొత్త సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నంలో విజయవంతంగా సక్సెస్ అవుతున్నారు కూడా.. దీనితో ప్రతి ఓటీటీ లోకి వచ్చే క్వాలిటీ కంటెంట్ పెరుగుతుంది. ఇక కొన్ని సినిమాలు థియేటర్ లో రిలీజ్ అయినా నెల రోజులలోపే అడుగుపెడుతుంటే., కొన్ని మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి వరుణ్ సందేశ్ నింద మూవీ యాడ్ అయింది. ఆల్రెడీ గతంలో ఈ మూవీ ఓటీటీ టాక్ వచ్చింది కానీ.. స్ట్రీమింగ్ కు మాత్రం రాలేదు. ఇక తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి విషయాలు చూసేద్దాం.
వరుణ్ సందేశం అనగానే అందరికి కొత్త బంగారు లోకం ,హ్యాపీ డేస్ సినిమాలే గుర్తొస్తూ ఉంటాయి. దీనితో తన నెక్స్ట్ సినిమాలపై అందరు భారీగా అదే రేంజ్ అంచనాలను ఏర్పరచుకోవడంతో.. వచ్చిన ఏ సినిమా కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక రీసెంట్ గా వరుణ్ తీసిన మూవీ నింద. జూన్ 21 న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా అయినా వరుణ్ కు హిట్ తెచ్చిపెడుతుంది అనుకుంటే.. మిక్స్డ్ టాక్ తోనే సరిపెట్టుకుంది. ఇక ఆ తర్వాత ఆగష్టు లో ఈ మూవీ ఓటీటీ లోకి వస్తుందనే బజ్ వినిపించినా కానీ.. మూవీ మాత్రం స్ట్రీమింగ్ కు రాలేదు. దాదాపు ఈ సినిమాను అంత మర్చిపోయే టైమ్ కి.. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో సెప్టెంబర్ 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది. మరి ఈ మూవీ ఓటీటీ లో ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.
ఇక నింద మూవీ కథ విషయానికొస్తే.. మంజు అనే యువతిని హత్యాచారం చేసి చంపాడనే.. కేసులో.. బాలరాజు అని వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ లో కుడా అతనే ఆ నేరం చేసినట్లు ప్రూవ్ అవుతుంది. దీనితో కోర్టులో అతనికి ఉరి శిక్ష విధిస్తారు. కానీ జడ్జ్ మాత్రం.. ఈ హత్య అతను చేయలేదని నమ్ముతాడు. ఎలాగైనా అతనిని నిర్దోషిగా ప్రూవ్ చేయాలనీ.. హ్యూమన్ రైట్స్ కమీషన్‌లో పనిచేసే తన కొడుకును కోరుతాడు. దీనితో అతని కొడుకు వివేక్.. తండ్రి మాట కోసం ఆ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఎం అయింది ? ఆ ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి నిజాలు బయటకు వచ్చాయి ? ఆ హత్య నిజంగా బాలరాజు చేసి ఉండకపోతే ఎవరు చేసి ఉంటారు ? తర్వాత ఏం జరిగింది ? అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.