iDreamPost
android-app
ios-app

OTTలోకి అనుష్క హీరో క్రైమ్ థ్రిల్లర్.. మలయాళంలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది!

  • Published May 13, 2024 | 5:41 PM Updated Updated May 13, 2024 | 5:41 PM

OTT New Releases: అనుష్క హీరో యాక్ట్ చేసిన ఒక క్రైమ్ థ్రిల్లర్.. అది కూడా మలయాళం చిత్రం తెలుగులోకి వచ్చేస్తోంది. మరి.. ఆ మూవీ ఏది? ఆ చిత్రం ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

OTT New Releases: అనుష్క హీరో యాక్ట్ చేసిన ఒక క్రైమ్ థ్రిల్లర్.. అది కూడా మలయాళం చిత్రం తెలుగులోకి వచ్చేస్తోంది. మరి.. ఆ మూవీ ఏది? ఆ చిత్రం ఎందుకు అంత స్పెషలో చూద్దాం.

  • Published May 13, 2024 | 5:41 PMUpdated May 13, 2024 | 5:41 PM
OTTలోకి అనుష్క హీరో క్రైమ్ థ్రిల్లర్.. మలయాళంలో బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది!

ఈ ఏడాది మొత్తం మలయాళం మూవీస్ హవా కొనసాగుతోంది. దాదాపుగా పాన్ ఇండియా లెవల్లో మలయాళం మూవీస సత్తా చాటాయి. ఇప్పుడు మరో మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. అది కూడా మలయాళంలో సూపర్ సక్సెస్ సాధించిన చిత్రం ఇది. పైగా అనుష్కాతో భాగమతి మూవీలో హీరోగా చేసిన ఉన్ని ముంకుందన్ హీరోగా నటించిన చిత్రం ఇది. సాధారణంగానే మలయాళం మూవీస్ కి మంచి క్రేజ్ ఉంది. పైగా ఇది క్రైమ్ థ్రిల్లర్.. అంతేకాకుండా మలయాళంలో మంచి హిట్టు కూడా కొట్టింది. మరి.. ఆ మూవీ ఎక్కడ రాబోతోంది? ఆ కథ ఏంటో చూద్దాం.

ఉన్ని ముకుందన్ స్టోరీ సెలక్షన్ చాలా భిన్నంగా ఉంటుంది. ఎంతో భిన్నమైన కథలను ఎంచుకుంటూ ఉంటాడు. నిజానికి హీరోగా అనే కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉండే కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ ఉంటాడు. అలాగే లేడీ ఓరియంటెడ్ అయినా అనుష్కతో కలిసి భాగమతిలో చేశాడు. అలాగే ఇటీవల వచ్చిన మాలికాపురం మూవీకి తెలుగులో మంచి అప్లాజ్ లభించింది. ఉన్ని ముకుందన్ చిత్రం అంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ ని సొంతం చేసుకున్నాడు. అలాంటి హీరో నుంచి క్రైమ్ థ్రిల్లర్ అనగానే తెలుగు ఓటీటీ ఫ్యాన్స్ ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. రిలీజ్ చేయండి సార్ బ్రేక్ ఇస్తాం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రిలీజ్ కి ముందే మంచి క్రేజ్, ప్రచారం అయితే దక్కింది.

ఈ మూవీ మరేదో కాదు.. ఉన్ని ముకుందన్ హీరోగా చేసిన జై గణేశ్ చిత్రం. ఈ మూవీ ఏప్రిల్ 11న మలయాళంలో విడుదలయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది. కథ, యాక్టింగ్ పరంగా చాలా మంచి టాక్ దక్కించుకుంది. కానీ, కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు అనే అభిప్రాయాలు వినిపించాయి. పైగా ఈ జై గణేశ్ చిత్రంలో ఉన్ని ముకుందన్ హీరో మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్ కూడా. ఈ మూవీలో మహిమా నంబియార్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. రంజిత్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రొడ్యూసర్ గా ఉన్ని ముకుందన్ కు మూడో చిత్రం కావడం విశేషం.

ఈ జైగణేశ్ చిత్రం రెండు ఓటీటీల్లోకి రాబోతోందని తెలుస్తోంది. మనోరమ మ్యాక్స్ లోనే కాకుండా.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా ఈ జై గణేశ్ చిత్రం విడుదల కాబోతోందని తెలుస్తోంది. అయితే మనోరమ మ్యాక్స్ లో కేవలం మలయాళం వర్షన్ మాత్రమే విడుదలవుతుంది అంటున్నారు. కానీ, అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదలవుతుందంట. అయితే ఈ మూవీ మే 17 లేదా మే 24వ తేదీన ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుందని చెప్తున్నారు. మరి.. ఉన్ని ముకుందన్ హీరో, ప్రొడ్యూసర్ గా చేసిన ఈ జై గణేశ్ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందో వేచి చూడాలి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetbaba girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom