iDreamPost
android-app
ios-app

ఈ వారం థియేటర్/ OTTల్లో ఏకంగా 12 సినిమాలు రిలీజ్.. ఏవి స్పెషల్ అంటే?

  • Published Jul 22, 2024 | 12:35 PM Updated Updated Jul 22, 2024 | 12:35 PM

This Week Theatre And OTT Movie Releases Details: మూవీ ప్రియులకు అలర్ట్. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఏకంగా 12 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఏవి మీరు అస్సలు మిస్ కాకూడతో చూడండి.

This Week Theatre And OTT Movie Releases Details: మూవీ ప్రియులకు అలర్ట్. ఈ వారం థియేటర్, ఓటీటీల్లో ఏకంగా 12 సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో ఏవి మీరు అస్సలు మిస్ కాకూడతో చూడండి.

  • Published Jul 22, 2024 | 12:35 PMUpdated Jul 22, 2024 | 12:35 PM
ఈ వారం థియేటర్/ OTTల్లో ఏకంగా 12 సినిమాలు రిలీజ్.. ఏవి స్పెషల్ అంటే?

రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు సినిమా అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. మనకు పండగ ఉన్నా.. స్పెషల్ ఈవెంట్ ఉన్నా.. ఏదైనా ఆటవిడుపు కావాలి అన్నా సినిమానే చూస్తాం. అందుకే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఈవారం వచ్చే కొత్త సినిమాలు ఏంటి అని తెగ ఎదురుచూస్తుంటారు. అలాంటి వారికోసం ఈసారి క్రేజీ లిస్ట్ తీసుకొచ్చాం. ఈ వారం ఏకంగా థియేటర్, ఓటీటీల్లో కలిపి 12 సినిమాలు విడుదల అవుతున్నాయి. అయితే అన్నీ కవర్ చేయలేరు. కానీ, వాటిలో ఏది బెస్ట్.. ఏ మూవీని మీరు అస్సలు మిస్ కాకూడదు అనే విషయాన్ని మాత్రం మనం ఇప్పుడు చూద్దాం. ఏ మూవీపై ఎక్కువ బజ్ ఉంది? దేనికోసం ఎక్కువ ఎదురుచూస్తున్నారో చూద్దాం.

థియేటర్లో:

ఈ వారం మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ లిస్ట్ ఫస్ట్ ప్లేస్ లో ధనుష్ 50వ చిత్రం రాయన్ ఉంటుంది. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఈ మూవీని ధనుష్ రాసి, డైరెక్ట్ చేశాడు. అలాగే ఈ మూవీలో ఫుల్ ఆఫ్ యాక్షన్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈ మూవీ జులై 26న థియేటర్లలో విడుదల అవుతోంది. ఇంక ఈ మూవీ తర్వాత పలాస చిత్రం ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా వెంకట సత్య తెరకెక్కించిన చిత్రం ఆపరేషన్ రావణ్. ఈ మూవీలో రాధిక కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ కథ చూస్తే ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ లా కనిపిస్తోంది. ఈ మూవీ కూడా జులై 26నే థియేటర్లలో విడుదల కాబోతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీ అంచనాలు పెరిగాయి. ఇంక ఈ మూవీ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా వస్తున్న పురుషోత్తముడు ఉంది. ఇది ప్రేమ, యాక్షన్ కలగలిపిన చిత్రంగా ఉంది. ఈ చిత్రం కూడా జులై 26నే విడుదల అవుతోంది.

హాట్ స్టార్:

  • చట్నీ సాంబారం (తమిళ్)- జులై 26
  • బ్లడీ ఇష్క్ (హిందీ)- జులై 26

నెట్ ఫ్లిక్స్:

  • ది డెకామెరాన్ (సిరీస్)- జులై 25
  • డ్రాగన్ ప్రిన్స్ 6 (సిరీస్)- జులై 26
  • ఆహా: రాజు యాదవ్- జులై 24
  • జియో సినిమా: విచ్ బ్రింగ్స్ మీ టూ యూ (ఇంగ్లీష్)- జులై 26
  • జీ5: భయ్యాజీ (హిందీ)- జులై 25
  • ప్రైమ్ వీడియో: ది మినిస్ట్రీ ఆఫ్ అన్ జెంటిల్ మాన్లీ వార్ ఫేర్ (ఇంగ్లీష్)- జులై 25
  • బుక్ మై షో: వన్ లైఫ్ (ఇంగ్లీష్)- జులై 25

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişrekabet girişgrandpashabet