Must Watch Movies In OTT In This Week: ఈ వారం OTT లో ఈ 5 సినిమాలు చాలా స్పెషల్.. అసలు మిస్ చేయకండి

ఈ వారం OTT లో ఈ 5 సినిమాలు చాలా స్పెషల్.. అసలు మిస్ చేయకండి

Must Watch Movies In OTT In This Week: ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. మరి వాటిలో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

Must Watch Movies In OTT In This Week: ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనే లిస్ట్ ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. మరి వాటిలో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పుడు రెగ్యులర్ గా ఓటీటీ లో సినిమాలు , సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకులు కూడా వీటికి అలవాటు పడిపోయారు. వారు ఎదురుచూసేదల్లా వారిని మెప్పించే ఇంట్రెస్టింగ్ మూవీస్ వస్తున్నాయా లేదా అనే పాయింట్ కోసమే. దీనితో మేకర్స్ కూడా ఓటీటీ లకు ప్రేక్షకులలో పెరుగుతున్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని.. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్ తోనే సినిమాలను రిలీజ్ చేస్తున్నారు. మరి వాటిలో ఈ వారం ఓటీటీ లోకి వచ్చే సినిమాలు , సిరీస్ లలో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి. అనే విషయాలపై ఓ లుక్ వేసేయండి.

ఈ వారం ఓటీటీ లో రిలీజ్ అయ్యే ఇంట్రెస్టింగ్ సినిమాలు , సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

భారతీయుడు 2:

ఈ సినిమా గురించి ఇప్పటివరకు తరచూ ఎన్నో వార్తలు చూసే ఉంటారు. మొదటి షో నుంచి ఈ మూవీ థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో.. ఈ సినిమాను థియేటర్ కు వెళ్ళి చూసే వారి సంఖ్య తగ్గిపోయింది. అసలు సినిమా ఎందుకు ప్లాప్ అయిందో తెలుసుకోవాలని అనుకున్న కొంతమంది మాత్రం… ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీ లో రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. కాగా చాలా డిస్కషన్స్ తర్వాత.. ఫైనల్ గా ఈ సినిమా ఆగష్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి టాక్ సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా:

2021 లో తాప్సి మెయిన్ లీడ్ లో హసీన్ దిల్‌రుబా అనే సినిమా రిలీజ్ అయింది . ఈ సినిమాకు ఊహించని ఆదరణ లభించడంతో.. ఇక ఇప్పుడు దానికి సిక్వెల్ గా ఫిర్ అయీ హసీన్ దిల్‍రూబా అనే సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ తో ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెల కొన్నాయి. కాగా ఈ సినిమా ఆగస్టు 9 నుంచి.. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కచ్చితంగా రెండవ పార్ట్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ నే సంపాదించుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

టర్బో:

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన సినిమా ‘టర్బో’ .. మే 23వ తేదీన థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు థియేటర్స్ లో ఊహించని రెస్పాన్స్ దక్కింది. ఈ సినిమాకు వైశాక్ దర్శకత్వం వహించగా . మిధున్ మాన్యుయెల్ థామస్ కథ అందించారు. ఇక ఈ సినిమాను స్వయంగా మమ్ముటినే నిర్మించడం విశేషం. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయింది. మళయాళంతో పాటు తెలుగు , హిందీ , తమిళం , కన్నడ భాషల్లో ఈ సినిమా.. ఆగష్టు 9 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ లో స్ట్రీమింగ్ కు రానుంది.

గూడ్‍చాడీ:

బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్ , రవీనా టాండన్ , అరుణా ఇరానీ లాంటి వారు ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. డైరెక్ట్ గా ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ స్టోరీ లైన్ విషయానికొస్తే.. రెండు తరాలకు చెందిన ప్రేమ కథలను ఈ సినిమాలో చూపించనున్నారు. ఇక ఈ మూవీ ఆగష్టు 9 నుంచి జియో సినిమా ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ సినిమాను కూడా అసలు మిస్ చేయకుండా చూడండి.

గ్యారాగ్యారా :

కాలంలో వెనక్కు వెళ్ళి గతాన్ని మార్చవచ్చా అనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ఈ మూవీని తెరకెక్కించారు మేకర్స్. ఈ సినిమా కూడా నేరుగా ఓటీటీ లో రిలీజ్ కానుంది. సైన్స్ ఫిక్షన్ సినిమాలు ప్రేక్షకులకు బాగానే ఇంట్రెస్ట్ కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సినిమా కూడా అందరికి బాగానే నచ్చేస్తుంది. కాగా ఈ సినిమా ఆగష్టు 9 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఈ మూవీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.

ఇక ఈ సినిమాలతో పాటు వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments