Swetha
This Week Must Watch Movies In OTT: ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే విషయాలను ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో ఏ సినిమాలు వీకెండ్ కు అసలు మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలను కూడా చూసేద్దాం.
This Week Must Watch Movies In OTT: ఈ వారం ఓటీటీ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి అనే విషయాలను ఆల్రెడీ చూసే ఉంటారు. మరి వాటిలో ఏ సినిమాలు వీకెండ్ కు అసలు మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలను కూడా చూసేద్దాం.
Swetha
ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు చాలానే ఉన్నాయి. గత కొన్ని వారాలుగా ఓటీటీ లో తెలుగు కంటెంట్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది . ఎందుకంటే ప్రతి వారం ఎదో ఒక కొత్త తెలుగు వెబ్ సిరీస్ లేదా తెలుగు సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాయి. అలాగే ఈ వారం ప్రేక్షకులను మెప్పించేందుకు.. చాలానే ఇంట్రెస్టింగ్ సినిమాలు రెడీ గా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుటున్నాయనే విషయాలను చూసేద్దాం.
ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ చేయకుండా చూడాల్సిన సినిమాలు/సిరీస్ లు ఇవే
ఈ సినిమాకు సుధీర్ పుల్లట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కీడకోలా ఫేమ్ రాగ్ మయూర్ , ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సోషల్ మీడియాలో.. సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. అంతే కాకుండా ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో.. ఫ్యామిలీతో కలిసి ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. కాగా ఈ సినిమా ఆగష్టు 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.
నభ నటేష్ , ప్రియదర్శి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా.. జూలై 19న థియేటర్ లో రిలీజ్ అయింది. అయితే థియేటర్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక కలెక్షన్స్ విషయంలో కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో.. త్వరగానే థియేట్రికల్ రన్ ముగించుకుని.. ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోతుంది. ఈ సినిమా ఆగష్టు 13 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఆంథాలజీ సిరీస్ లు ఈ మధ్య బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో బడా హీరోలు కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్‍లాల్, ఫాహద్ ఫాజిల్ కలిసి నటించిన ఈ ఆంథాలజీ సిరీస్.. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్ లో మొత్తం 9 కథలకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జీ5 లో ఆగస్టు 15 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి.
అప్పట్లో వచ్చిన షెర్లాక్ హోమ్స్ కథలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు ఆ స్టోరీస్ నుంచి వస్తున్న ఇంట్రెస్టింగ్ డిటెక్టీవ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ .. శేఖర్ హోమ్స్ . సర్ ఆర్ధర్ కానన్ రాసిన కొన్ని షెర్లాక్ హోమ్స్ డిటెక్టీవ్ కథల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. కాగా ఈ సిరీస్ ఆగస్టు 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి.. ఈ సిరీస్ బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి.
తమిళ నటుడు సత్య రాజ్ లీడ్ రోల్ లో నటించిన వెబ్ సిరీస్ “మై పర్ఫెక్ట్ హస్బెండ్”. ఈ మధ్య ఫ్యామిలీతో కలిసి కూర్చుని చూసే సినిమాలు చాలా తక్కువ అయిపోయాయి. అలాంటి సమయంలో ఇలాంటి ఓ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ వస్తుందంటే ఎవరు మాత్రం మిస్ చేయాలనీ అనుకుంటారు. అందుకే ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూసేయండి. ఈ సిరీస్ ఆగష్టు 16 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ఈ సినిమాలే కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు , సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశం లేకపోలేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.