ఈ వారం OTT లో ఈ 4 సినిమాలు/సిరీస్ లను అసలు మిస్ చేయకండి..

Must Watch 4 Movies In This Weekend: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లలో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరి వాటిలో చూడదగిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

Must Watch 4 Movies In This Weekend: ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లలో చాలానే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరి వాటిలో చూడదగిన సినిమాలేంటో అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఇప్పుడు ఓటీటీ లలోకి సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవ్వడం అంతగా ఆశ్చర్యపోయే విషయమేమి కాదు.దాదాపు ఇప్పుడు అందరు ఓటీటీ లకు అలవాటు పడిపోయారు. ఎప్పుడు ఏ కొత్త సినిమాలు వస్తాయా అని ఎదురుచూస్తూ ఉన్నారు. ఇక వాటిలో కొన్ని సినిమాలు విపరీతమైన బజ్ తో ముందే అప్ డేట్స్ ఇస్తూ.. ఓటీటీ లోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు సైలెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అలాగే ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలలో.. ఏ సినిమాలు చూడడానికి ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని కూడా సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ కాబోయే సినిమాలలో చూడదగిన సినిమాలేంటో.. అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయనే విషయాలను చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో చూడదగిన సినిమాలు ఇవే

నాగేంద్రన్స్ హనీమూన్ :

వెబ్ సిరీస్ లంటే ప్రతి ఒక్కరు ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. ఇక ఈ వెబ్ సిరీస్ కోసం అయితే ప్రత్యేకించి వెయిట్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ పేరే కాస్త డిఫరెంట్ గా ఉంది. పల్లెటూరిలొ ఉండడానికి ఇష్టపడని ఓ వ్యక్తి.. ఫారెన్ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో.. ఐదుగురు అమ్మాయిలను పెళ్లి చేసుకోవడం.. వారందరితో కలిసి హనీమూన్ కు వెళ్లడం ఈ తరహాలో ఈ కథ కొనసాగుతూ ఉంటుంది. పూర్తి కథ తెలియాలంటే జులై 19 వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ మూవీ జూలై 19 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.

బహిష్కరణ :

నటి అంజలి ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ బహిష్కరణ. ఈ సిరీస్ లో అంజలి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందంటూ టాక్ వినిపిస్తుంది. ముకేశ్ ప్రజాపతి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇక ఈ రివెంజ్ థ్రిల్లర్ సిరీస్ లో అంజలి వేశ్య పాత్రలో నటించారు. ఈ సిరీస్ జూలై 19 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి అసలు మిస్ చేయకుండా చూసేయండి.

హాట్ స్పాట్ :

ఇదొక డిఫరెంట్ అడల్ట్ కామెడీ మూవీ.. ఈ తమిళ మూవీ మార్చి 29న తమిళ్ లో రిలీజ్ అయ్యింది. థియేటర్ లో ఈ సినిమాకు మిస్క్డ్ టాక్ లభించింది. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న సంఘటనలను.. భార్య భర్తల మధ్య ఉండే బంధాన్ని.. ఈ మూవీలో కళ్ళకు కట్టినట్లు చూపించారు మేకర్స్. ఇక ఈ సినిమా జూలై 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మరి తెలుగులో ఈ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఆడు జీవితం:

పృద్వి రాజ్ సుకుమారన్ నటించిన ఈ మూవీ., థియేటర్ లో బ్లాక్ బస్టర్ టాక్ సంపాదించుకున్న తర్వాత.. ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వడానికి అదిగో ఇదిగో అంటూ ఊరించింది. కానీ ఇప్పటివరకు స్ట్రీమింగ్ కు మాత్రం రాలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా జూలై 19 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మరి ఈసారైనా చెప్పిన టైమ్ కు వస్తుందో లేదో వేచి చూడాలి.

ఇక ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. ఈ వారం ఓటీటీ లో అసలు మిస్ కాకుండా చూడాల్సిన సినిమాలు,సిరీస్ లు ఇవే.. ఇంకా వీకెండ్ లోపు సైలెంట్ గా ఏదైనా సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు లేకపోలేదు. మరి ఈ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments