iDreamPost
android-app
ios-app

దేశాన్ని వణికించిన “ఐసీ 814: ది కాందహార్ హైజాక్” వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

  • Published Aug 12, 2024 | 4:41 PM Updated Updated Aug 31, 2024 | 12:52 PM

OTT Thriller Movie: థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించేవి కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

OTT Thriller Movie: థ్రిల్లర్ వెబ్ సిరీస్ లలో కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా తీసుకుని రూపొందించేవి కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ లో మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిపోతుంది. మరి ఈ సిరీస్ ఏంటో చూసేద్దాం.

  • Published Aug 12, 2024 | 4:41 PMUpdated Aug 31, 2024 | 12:52 PM
దేశాన్ని వణికించిన “ఐసీ 814: ది కాందహార్ హైజాక్” వెబ్ సిరీస్..  స్ట్రీమింగ్ ఎక్కడంటే ?

ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త సినిమాలు వస్తాయా అని.. ఎదురుచూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఆల్రెడీ ఈ వారం ఓటీటీ లోకి రాబోయే సినిమాలేంటి అవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి.. వాటిలో ఏ సినిమాలను అసలు మిస్ చేయకుండా చూడాలి అనే విషయాలను చూసే ఉంటారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలతో పాటు మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ ఎంట్రీకి రెడీ అయిపోతుంది. కొన్ని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ను బేస్ చేసుకుని.. రూపొందించిన సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది. అనే విషయాలను చూసేద్దాం.

ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మరేదో కాదు.. ఇప్పటివరకు దేశ చరిత్రలోనే అతి పెద్ద హైజాక్ గా చెప్పే.. కాందహార్ ప్లేన్ హైజాక్ పై రూపొందించిన సిరీస్.. “ఐసీ 814: ది కాందహార్ హైజాక్”. తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన టీజర్ ను కూడా రివీల్ చేశారు మేకర్స్. డిసెంబర్ 24, 1999లో ఈ భయంకరమైన ఫ్లైట్ హైజాక్ జరిగింది. మన చరిత్రలోనే ఇదొక డార్క్ డే అంటూ టీజర్ లో పేర్కొన్నారు. కాగా ఈ సిరీస్ లో విజయ్ వర్మ, అరవింద్ స్వామి, నటి పత్రలేఖ , కుముద్ మిశ్రా, నసీరుద్దీన్ షా లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఆ సమయంలో అసలు ఏం జరిగింది అనే విషయాలను.. ఈ సిరీస్ లో కళ్ళకు కట్టినట్లు చూపించనున్నారు మేకర్స్. కాగా ఈ సిరీస్ ఆగష్టు 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఆ సమయంలో జరిగిన హైజాక్ విషయానికొస్తే.. అది కేవలం ఒక్క విమానం హైజాక్ మాత్రమే కాదంటూ.. మొత్తం దేశం హైజాక్ అంటూ ఈ టీజర్ లో చూపించారు. అంతే కాకుండా ఆ విమానంలో ఉండే 189 మంది కాపాడడంతో పాటు.. హైజాకర్ల డిమాండ్స్ ను నెరవేర్చడంలోనూ.. వారికి చాలా సవాళ్లు ఎదురైనట్లు సమాచారం. మొత్తం ఏడు రోజుల్లో జరిగిన ఈ హైజాక్ ను ఈ ఒక్క సిరీస్ తో అందరికి తెలియజేయనున్నారు. ఇలాంటి సిరీస్ లు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సిరీస్ ను అసలు మిస్ చేయకుండా చూడండి. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.