iDreamPost
android-app
ios-app

OTT లోకి వెరైటీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 28, 2024 | 4:00 AM Updated Updated Aug 28, 2024 | 4:00 AM

OTT New Releases- Thalavan Movie OTT Streaming: మలయాళం నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు అంతే ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. ఇక వాటిలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కథలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

OTT New Releases- Thalavan Movie OTT Streaming: మలయాళం నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినా కానీ ప్రేక్షకులు అంతే ఇంట్రెస్ట్ గా చూస్తూ ఉంటారు. ఇక వాటిలో క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ కథలు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 28, 2024 | 4:00 AMUpdated Aug 28, 2024 | 4:00 AM
OTT లోకి వెరైటీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘తలవన్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఓటీటీ లోకి ఎన్ని సినిమాలు వచ్చినా కానీ ఎప్పుడెప్పుడు కొత్త మూవీస్ వస్తాయా అని.. ఎదురుచూస్తూ ఉంటారు మూవీ లవర్స్. ఈ క్రమంలో ప్రతి వారం ప్రేక్షకులకు బోర్ కొట్టకుండా కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆ సినిమాల కథలను బట్టి వాటికి లభించే ఆదరణ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అందులోను ఓటీటీ లో మలయాళ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటూ ఉంటారు. ఓటీటీ లోకి ఎలాంటి మలయాళ సినిమాలు వచ్చినా కానీ.. వెంటనే చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో మరొక ఇంట్రెస్టింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది . మరి ఆ మూవీ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ మరేదో కాదు.. బిజు మీనన్ , ఆసిఫ్ అలీ హీరోలుగా నటించిన “తలవన్”. దాదాపు 10కోట్ల బడ్జెట్ తో థియేటర్స్ లో రిలీజ్ అయినా ఈ సినిమా ఊహించని విధంగా.. 25 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దీనితో థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని.. ఎదురుచూస్తున్నారు. థియేటర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందంటే.. ఇక ఓటీటీ లో ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సోనీలివ్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 10 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు రానుంది. కాబట్టి ఈ మూవీని అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. బిజు మీనన్ , ఆసిఫ్ అలీ ఈ ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్. ఓసారి ఆసిఫ్ అలీ.. ట్రాన్స్ఫర్ పైన బిజు మీనన్ పని చేస్తున్న పోలీస్ స్టేషన్ కు వస్తాడు. వీరిద్దరికి ఒకరంటే ఒకరికి అసలు పడదు. ఎదురైన ప్రతి సారి ఎదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. దీనితో ఓసారి బిజుపై రివెంజ్ తీర్చుకోడానికి ట్రై చేస్తాడు అసిఫ్. ఈ క్రమంలో కొన్నాళ్ళకు బిజూ మీనన్ ఇంటి పై ఓ హత్య జరుగుతుంది. ఇదే అదునుగా భావించి అతనిని అరెస్ట్ చేయిస్తాడు అసిఫ్. నిజంగానే ఆ హత్యకు, బిజూ కు ఏదైనా సంబంధం ఉందా ? ఈ కేసు నుంచి బిజు మీనన్ ఎలా బయటపడ్డాడు ? ఈ కేసును ఆసిఫ్ చేపట్టడానికి కారణం ఏంటి ? అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.