iDreamPost
android-app
ios-app

OTT లోకి అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ ‘సింబా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

  • Published Sep 04, 2024 | 4:12 PM Updated Updated Sep 04, 2024 | 4:12 PM

Telugu Movie Simbaa OTT Streaming : ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త మూవీస్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

Telugu Movie Simbaa OTT Streaming : ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి కొత్త మూవీస్ వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Sep 04, 2024 | 4:12 PMUpdated Sep 04, 2024 | 4:12 PM
OTT లోకి అనసూయ సైకలాజికల్ థ్రిల్లర్ ‘సింబా’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీ లోకి కొత్త సినిమాలు వస్తున్నాయంటే.. ప్రేక్షకులలో ఓ రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. ఈ క్రమంలో వరుసగా ఓటీటీ లో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ , సస్పెన్స్ థ్రిల్లర్స్ , ఇన్వెస్టిగేటివ్ మూవీస్, సిరీస్ అని ఇలా అన్ని రకాల జోనర్స్ లో కొత్త కంటెంట్ వచ్చేస్తుంది. చూడబోతుంటే రాను రాను ఓటీటీ ల క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కొత్త రిలీజెస్ లిస్ట్ లోకి అనసూయ నటించిన మరొక ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ రాబోతుంది. అదే సింబా మూవీ. మరి ఈ మూవీ ఎప్పటినుంచి… ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ కు రానుంది అనే విషయాలను తెలుసుకుందాం.

సింబా సినిమాలో జగపతి బాబు , అనసూయ ప్రధాన పాత్రలలో నటించారు. కాగా ఈ సినిమాకు సంపత్ నంది స్టోరీ, డైలాగ్స్ అందించగా.. మురళి మోహన్ దర్శకుడిగా వ్యవహరించారు. ఇక ఈ మూవీలో అనసూయ , జగపతి బాబుతో పాటు..వ‌శిష్ట సింహా, దివి, శ్రీనాథ్‌ మాగంటి ప్రధాన పాత్రలలో నటించారు. థియేటర్ లో యావరేజ్ టాక్ సంపాదించుకున్న ఈ మూవీ.. రిలీజ్ అయినా నెల రోజుల తర్వాత ఓటీటీ లో ఎంట్రీ ఇవ్వనుంది. ఇక ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 12 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ పై క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్ .

ఇక సింబా మూవీ కథ విషయానికొస్తే.. అనసూయ ఒక స్కూల్ టీచర్.. ఆమె నడిరోడ్డుపైనే ఓ వ్యక్తిని హత్య చేస్తుంది. సేమ్ అనసూయ చేసినట్లే… ఓ జర్నలిస్ట్ ఫాజిల్… అతను ప్రేమించిన అమ్మాయిని హత్య చేస్తాడు. అయితే చనిపోయిన ఆ ఇద్దరు వ్యక్తులు కూడా ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ను సంబంధించిన వ్యక్తులు కావడంతో.. ఈ కేసు ఇంకాస్త మిస్టరీగా మారింది. చివరికి ఆ బిజినెస్ మ్యాన్ తమ్ముడు కూడా అనుమానాస్పద రీతిలో హత్యకు గురవుతాడు. అసలు ఆ ఇద్దరూ ఎందుకు హత్యలు చేస్తున్నారు? వారు నిజంగా హంతకులేనా ? ఆ బిజినెస్ మ్యాన్ మనుషులనే ఎందుకు టార్గెట్ చేశారు ? ఆ తర్వాత ఏమైంది అనేదే మూవీ కథ. మరి ఈ సినిమా అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.