iDreamPost
android-app
ios-app

OTT లోకి తెలుగు ఎమోషనల్ డ్రామా ‘దీపావళి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

  • Published Aug 29, 2024 | 12:03 PM Updated Updated Aug 29, 2024 | 12:03 PM

OTT New Releases- Telugu Movie Deepavali: ఓటీటీ లో తెలుగు కంటెంట్ లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ప్రతి వారం ఎదో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను .. డబ్బింగ్ సినిమాలను తీసుకుని వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ తెలుగు మూవీ వచ్చేసింది మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

OTT New Releases- Telugu Movie Deepavali: ఓటీటీ లో తెలుగు కంటెంట్ లో ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. ప్రతి వారం ఎదో ఒక స్ట్రైట్ తెలుగు సినిమాను .. డబ్బింగ్ సినిమాలను తీసుకుని వస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ యాడ్ తెలుగు మూవీ వచ్చేసింది మరి ఈ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Aug 29, 2024 | 12:03 PMUpdated Aug 29, 2024 | 12:03 PM
OTT లోకి తెలుగు ఎమోషనల్ డ్రామా ‘దీపావళి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!

ఇప్పుడు భాషా బేధం లేకుండా.. కంటెంట్ బావుంటే చాలు అనుకుని.. అన్ని సినిమాలను ఆదరిస్తున్న మాట వాస్తవమే. కానీ తెలుగు సినిమాలను చూడడంలో వచ్చే తృప్తి .. ఇతర భాషల సినిమాలు చూసినప్పుడు ఉండదని.. కొంతమంది భావిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ప్రస్తుతం డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ తెలుగు కంటెంట్ కు ప్రాధాన్యత పెరిగిపోయింది. థియేట్రికల్ రిలీజెస్ కాకుండా.. వారం వారం కొన్ని తెలుగు స్ట్రైట్ సినిమాలను , సిరీస్ లను లేదా డబ్బింగ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తూనే ఉన్నారు. దీనితో ఓటీటీ లవర్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. ఈ క్రమంలో అచ్చ తెలుగు కంటెంట్ అందించే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్.. మరొక ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాతో.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ సినిమా పేరు దీపావళి.. దీనిని తమిళ చిత్రం కిడా అనే సినిమాకు డబ్బింగ్ వెర్షన్ గా రూపొందించారు. తమిళంలో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన తర్వాత తెలుగులో.. దీపావళి అనే పేరుతో గత సంవత్సరం ఈ సినిమాను థియేటర్ లో విడుదల చేశారు మేకర్స్. తెలుగులో కూడా ఈ మూవీ మంచి బజ్ నే సంపాదించుకుంది. కాగా ఈ సినిమాకు రా. వెంకట్ దర్శకత్వం వహించగా.. రాము, కాళి వెంకట్, దీపన్, పాండియమ్మ, వియజ, లోకి, కమలి లాంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఇన్నాళ్లకు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వీకెండ్ కు ఓ మంచి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా మూవీ చూడాలంటే మాత్రం ఈ సినిమా బెస్ట్ ఛాయస్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. ఒక చిన్న గ్రామంలో శీనయ్య , తన మనవడు గణేష్ , ఒక పెంపుడు మేకతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. ప్రశాంతగా ఆ ముగ్గురు జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు గణేష్ దీపావళికి కొత్త బట్టలు కావాలని శీనయ్యను అడుగుతాడు. శీనయ్య కూడా కొనిస్తానని చెప్తాడు. కానీ సరిగ్గా ఆ సమయం వచ్చే సరికి తన దగ్గర డబ్బులు ఉండవు. ఆ డబ్బులు సంపాదించడం కూడా అతనికి కష్టంగా మారుతుంది. దీనితో అతనికి ఏం చేయాలో అర్ధం కాక. ఊరిలో ఉండే కసాయి వీరసామి దూకాణంలో.. మేక అవసరం అని తెలుసుకుంటాడా ? ఆ తర్వాత ఏమైంది ? శీనయ్య ఏ నిర్ణయం తీసుకున్నాడు ? ఆ మేక ను కానీ అమ్మేసాడా ? గణేష్ తన తాత కష్టాన్ని అర్ధం చేసుకున్నాడా లేదా ? ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.