OTT లోకి వణికించే తెలుగు హర్రర్ సిరీస్..’ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’.. స్ట్రీమింగ్ డేట్ ఇదే

OTT Telugu Horror Series- The Mystery Of Moksha Island: ఓటీటీ లో ప్రేక్షకులు ఇష్టంగా చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి హర్రర్ సినిమాలే. ఎన్ని హర్రర్ సినిమాలు చూసినా కానీ.. చూడడానికి ఇంకా చాలానే సినిమాలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ హర్రర్ మూవీస్ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

OTT Telugu Horror Series- The Mystery Of Moksha Island: ఓటీటీ లో ప్రేక్షకులు ఇష్టంగా చూసే సినిమాలు ఏమైనా ఉన్నాయంటే అవి హర్రర్ సినిమాలే. ఎన్ని హర్రర్ సినిమాలు చూసినా కానీ.. చూడడానికి ఇంకా చాలానే సినిమాలు ఉంటూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ హర్రర్ మూవీస్ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతుంది. మరి ఆ మూవీ ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లోకి రాబోయే లిస్ట్ ఆల్రెడీ చూసే ఉంటారు. ఇలా ప్రతి వారం డిఫరెంట్ క్యాటగెరీస్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు వస్తూ ఉంటున్నాయి. అయితే వీటిలో ప్రేక్షకులు ఎక్కువగా చూసే జోనర్ హర్రర్ అని చెప్పి తీరాలి. ఎందుకంటే ఏదైనా హర్రర్ మూవీ ఓటీటీ లోకి వస్తుందంటే.. మూవీ లవర్స్ కు ముందు నుంచే బాగా క్యూరియాసిటీ పెరిగిపోతుంది. ఎన్ని హర్రర్ మూవీస్ చూసినా కానీ.. చూడడానికి ఇంకా చాలానే సినిమాలు మిగిలిపోతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ హర్రర్ సిరీస్ రాబోతుంది. మరి సిరీస్ ఈ  ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతుందో చూసేద్దాం .

ఈ సిరీస్ పేరు.. ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్’. తెలుగులో ఇలాంటి సిరీస్ లు చాలా తక్కువగా వస్తూ ఉంటాయి. మొదటి నుంచి చివరి వరకు కదలకుండా వెన్నులో వణుకు తెప్పిస్తూ ఉంటాయి. వీటిని చూడడానికి ఎవరు మాత్రం ఇంట్రెస్ట్ చూపించకుండా ఉంటారు. అందులోను డైరెక్ట్ గా తెలుగులో వస్తున్న సినిమా ఇది. కాగా ఈ సిరీస్ ను డైరెక్ట్ గా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ చేయనున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అలాగే ట్రైలర్ తో పాటు.. స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 20 నుంచి హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. కాబట్టి హర్రర్ మూవీ లవర్స్ ఈ తెలుగు సిరీస్ అసలు మిస్ చేయకుండా చూసేయండి.

ఇక ట్రైలర్ ను గమనిస్తే.. ఈ ట్రైలర్ అంతా కూడా డాక్టర్ విశ్వక్సేన్ అనే వ్యక్తి గురించి చెప్పడంతో స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ దివి అంతా సృష్టించింది అతనే అంటూ ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. అయితే తన తర్వాత తన సంపదకు వారసులు ఎవరు అనేదే అందరికి ఓ పెద్ద ప్రశ్నగా మారుతుంది. దీనికోసం నికోబర్ లో ఉన్న తన ప్రైవేట్ ఐలాండ్ కు అతను తన వారసులందరిని.. ఆహ్వానిస్తాడు. దీనితో తమ వాటా కోసం ఎంతో మంది వారసులు ఆ ఐలాండ్ కు వెళ్తారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత వారంతా కూడా ఒక్కొక్కరిగా మిస్ అవుతూ ఉంటారు. ఎక్కువ ఆస్తి కోసం తమలో ఒకరు ఇలా చేస్తున్నారని ఒకరిపై ఒకరికి అనుమానాలు మొదలవుతాయి. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు ? ఆ మోక్ష ఐలాండ్ లో అసలు ఏం జరుగుతుంది ? చివరికి ఆస్తి ఎవరికీ దక్కుతుంది ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments