iDreamPost
android-app
ios-app

OTT లోకి రీసెంట్ తెలుగు యాక్షన్ డ్రామా ‘పరాక్రమం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

  • Published Sep 13, 2024 | 12:03 PM Updated Updated Sep 13, 2024 | 12:03 PM

Telugu Action Movie- Parakramam OTT Streaming Date: థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ నెల లోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా తెలుగు యాక్షన్ డ్రామా .. మూడు వారల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అదే పరాక్రమం మూవీ.. ఈ మూవీ ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

Telugu Action Movie- Parakramam OTT Streaming Date: థియేటర్స్ లో రిలీజ్ అయినా సినిమాలన్నీ నెల లోపే ఓటీటీ లోకి వస్తున్నాయి. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్ లో రిలీజ్ అయినా తెలుగు యాక్షన్ డ్రామా .. మూడు వారల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. అదే పరాక్రమం మూవీ.. ఈ మూవీ ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 13, 2024 | 12:03 PMUpdated Sep 13, 2024 | 12:03 PM
OTT లోకి రీసెంట్  తెలుగు యాక్షన్ డ్రామా ‘పరాక్రమం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా ఓటీటీ లో అన్ని సినిమాలకు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. దీనితో మూవీ మేకర్స్ కూడా ఓటీటీ ల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. మూవీ రిలీజ్ అయినా వెంటనే ఓటీటీ డీల్ ను డీసెంట్ ధరలకు క్లోజ్ చేసుకోవడం. ఇక థియేటర్ లో వచ్చిన టాక్ ను బట్టి.. సుమారు నెలలోపే ఆ సినిమాలను డిజిటల్ స్ట్రీమింగ్ కు తీసుకుని రావడం లాంటివి చేస్తున్నారు. ఒకవేళ థియేటర్ లో ఆ సినిమాలు ప్లాప్ అయినా కూడా.. ఓటీటీ లో మాత్రం హిట్ టాక్ తోనే దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు రీసెంట్ గా రిలీజ్ అయినా.. తెలుగు యాక్షన్ డ్రామా పరాక్రమం. మూడు వారాల లోపే ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ వివరాలు ఇలా ఉన్నాయి.

బండి సరోజ్ డైరెక్ట్ చేసిన పరాక్రమం మూవీ.. ఆగస్టు 22న థియేటర్స్ లో రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాలో బండి సరోజ్ తో పాటు.. శృతి సామాన్వి, నిఖిల్ గోపులాంటి వాళ్లు ప్రధాన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ లభించింది. దీనితో ఇప్పుడు ఓటీటీ లో ఈ సినిమా లక్ ను పరీక్షించుకోవడానికి ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా సొంతం చేసుకోగా. థియేటర్ లో రిలీజ్ అయిన మూడు వారాల లోపే ఓటీటీ లోకి రావడం విశేషం. ఈ సినిమాను సెప్టెంబర్ 14 నుంచి ఓటీటీ లోకి తీసుకురానున్నారు మేకర్స్. ఈ విషయాన్నీ.. “పులి వస్తే చెట్టెక్కుతావ్.. మగర్ మచ్చీ వస్తే ఒడ్డెక్కుతావ్.. యముడొస్తే ఏడికి పోతావ్.. బండి సరోజ్ పరాక్రమం ఆహాలో.. పరాక్రమం ప్రీమియర్ సెప్టెంబర్ 14న మీ ఆహాలో..” అనే క్యాప్షన్ తో ఆహా అనౌన్స్ చేసింది. కాబట్టి ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లోకి ఈ తెలుగు సినిమాను కూడా యాడ్ చేసుకోండి.

ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా లోవరాజు అనే ఓ థియేటర్ ఆర్టిస్ట్ చుట్టూ తిరుగుతుంది. అతను ఓ చిన్న గల్లీ క్రికెటర్ , అయితే అతను మాత్రం ఓ పెద్ద హీరో అవ్వాలని కలలు కంటూ ఉంటాడు. అతని తండ్రి ఒక థియేటర్ ఆర్టిస్ట్. తానూ చేయలేనిది తన కొడుకు లోవరాజు చేస్తాడంటూ తన ప్రాణం తీసుకుంటాడు. ఇక మరో వైపు ఎప్పటికైనా రవీంద్ర భారతిలో నాటకాన్ని ప్రదర్శిస్తానని తిరుగుతూ ఉండే.. లోవరాజు పరాక్రమం అనే తన తండ్రి నాటకంలో యముడిగా చేస్తాడు.. ఈ క్రమంలో అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి.. దాని వలన అతని జీవితం ఎలా మలుపు తిరిగింది.. అనేదే మిగిలిన కథ. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.