iDreamPost
android-app
ios-app

7నెలలుగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ మూవీ! ఇప్పుడు తెలుగు వెర్షన్ OTTలోకి!

  • Published Aug 05, 2024 | 11:00 PM Updated Updated Aug 05, 2024 | 11:00 PM

OTT Suspense Thriller In Telugu : ఓటీటీ లో తెలుగు సినిమాలకు ఆదరణ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ముందు ఇతర భాషల్లో రిలీజ్ అయినా సినిమాలు కూడా తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. అదేంటో చూసేద్దాం.

OTT Suspense Thriller In Telugu : ఓటీటీ లో తెలుగు సినిమాలకు ఆదరణ బాగా పెరుగుతుంది. ఈ క్రమంలో ముందు ఇతర భాషల్లో రిలీజ్ అయినా సినిమాలు కూడా తెలుగులోకి వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరొక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. అదేంటో చూసేద్దాం.

  • Published Aug 05, 2024 | 11:00 PMUpdated Aug 05, 2024 | 11:00 PM
7నెలలుగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ మూవీ! ఇప్పుడు తెలుగు వెర్షన్ OTTలోకి!

ప్రస్తుతం లాంగ్వేజ్ బారియర్ లేకుండా.. ఓటీటీ లోకి వచ్చే ఎలాంటి సినిమాలనైనా , సిరీస్ లనైనా సరే కథను బట్టి ప్రేక్షకులు బాగానే ఆదరిస్తూనే ఉన్నారు. కానీ ఆయా సినిమాలను తెలుగులో చూస్తే ఆ కథలో ఉండే ఎమోషన్ ను ఇంకాస్త ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎక్కువమంది తెలుగులో సినిమాలను చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ తమిళ థ్రిల్లర్ మూవీ తెలుగులోకి రాబోతుంది. ఆ మూవీ స్ట్రీమింగ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేయండి.

తమిళ్ వెర్షన్ నుంచి తెలుగు వెర్షన్ కు వస్తున్న ఈ సినిమా మరేదో కాదు .. “బర్త్ మార్క్”. ఈ సినిమా ఫిబ్రవరి 23 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఈ సినిమాకు విక్రమ్ శ్రీధరన్ దర్శకత్వం వహించగా.. షబీర్ కల్లరక్కల్, మిర్నా మీనన్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు. తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు వెర్షన్ ఓటీటీ లోకి రాబోతుంది. బర్త్ మార్క్ తెలుగు వెర్షన్ మూవీ ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. “లోకం చూడబోతున్న శిశువు.. కానీ కాలమే తన శత్రువు. ఆగస్టు 8న ఆహాలో బర్త్‌మార్క్ ప్రీమియర్ అవుతుంది” అంటూ ఆహా అధికారికంగా ప్రకటించింది. తమిళ థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను ఎలాగూ ఆకట్టుకుంటాయి కాబట్టి.. తెలుగు వెర్షన్ కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

ఇక బర్త్ మార్క్ సినిమా కథ విషయానికొస్తే.. ఈ సినిమా అంతా కూడా ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ డానియెల్, అతని వైఫ్ జెన్నిఫర్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. బోర్డర్ లో పట్టుబడడం వలన 6 నెలల తర్వాత ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే జెన్నిఫర్ ప్రెగ్నెంట్. ఈ క్రమంలో ఆమెకు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీనితో డానియల్ ఆమెను నార్మల్ డెలివెరి చేసే కేరళలోని ఓ గ్రామానికి తీసుకుని వెళ్తాడు. కానీ అక్కడ ఎటువంటి సరైన వసతులు ఉండవు.. దీనితో ఆమె అనేక ఇబ్బందులు పడుతూ ఉంటుంది. అయినా సరే నార్మల్ డెలివెరి కోసం అదే ఊరిలో ఉండాలని చెప్తారు. దీనితో తన కడుపులో బిడ్డకు కావాలనే ఎదో ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారని ఆమెకు అర్ధమౌతుంది. అసలు దాని వెనుక కారణాలు ఏంటి ? ఆమెకు హాని చేయాలనీ అనుకున్నది ఎవరు ? ఆమెకు డెలివెరి ఎలా జరిగింది ? అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş