iDreamPost
android-app
ios-app

OTT Movie: OTT లోకి ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ ‘స్టార్’ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

  • Published Jun 07, 2024 | 12:33 PM Updated Updated Jun 07, 2024 | 12:33 PM

ఈ వారం ఓటీటీ లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో.. ప్రేక్షకులంతా ఏవైనా మంచి సినిమాలు ఉన్నాయేమో అని వెతికే పనిలో ఉన్నారు. ఇక మంచి సినిమాలంటే భాషతో సంబంధం లేదు. కాబట్టి అలాంటి ఓ సినిమానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

ఈ వారం ఓటీటీ లో చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో.. ప్రేక్షకులంతా ఏవైనా మంచి సినిమాలు ఉన్నాయేమో అని వెతికే పనిలో ఉన్నారు. ఇక మంచి సినిమాలంటే భాషతో సంబంధం లేదు. కాబట్టి అలాంటి ఓ సినిమానే ఓటీటీ లో స్ట్రీమింగ్ అయిపోతుంది. మరి ఆ సినిమా ఏంటో చూసేద్దాం.

  • Published Jun 07, 2024 | 12:33 PMUpdated Jun 07, 2024 | 12:33 PM
OTT Movie: OTT లోకి  ఇంట్రెస్టింగ్ తమిళ మూవీ ‘స్టార్’ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే !

ఓటీటీ సినిమాలంటే అందరికి మక్కువ పెరిగిపోతుంది. ఎప్పుడెప్పుడు ఏ ఏ సినిమాలు ఓటీటీ లోకి వస్తాయా అని ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఏ ఏ సినిమాలు వస్తాయా అని ఎదురుచూసే ప్రేక్షకులకు కాస్త నిరాశ మిగిలిందని చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ వారం మరి అంత చెప్పుకోదగిన సినిమాలేవీ లేవు. దీనితో మూవీ లవర్స్ కు కాస్త నిరాశ మిగిలింది. కానీ ఉన్న వాటిలో కాస్త మంచి సినిమాలు ఏంటి అనే లిస్ట్ కూడా ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా ఈ లిస్ట్ లో దాదాపు యాడ్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

మూవీ లవర్స్ అంతా ఇప్పుడు కేవలం తెలుగు సినిమాలను మాత్రమే చూస్తామని అనుకోడం లేదు. వారు కూడా మంచి కథల కోసం అన్ని భాషల చిత్రాలను చూసేస్తున్నారు. భాష రాకపోయినా సరే ఆయా సినిమాలను సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూస్తున్నారు. దీనిని బట్టే అర్థంచేసుకోవచ్చు ఇతర భాషల కథలను ప్రేక్షకులంతా ఏ రేంజ్ లో ఆదరిస్తున్నారు అనేది. ఇక ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటిదే. ఇది ఒక తమిళ సినిమా.. ఈ సినిమా పేరు “స్టార్”. ఈ సినిమాలో కవిన్, అదితి పోహాన్కార్, ప్రీతి ముకుందన్, లాల్, సంజయ్ స్వరూప్ , గీత కైలాసం లాంటి వారు ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమా ఇటీవలే తమిళంలో థియేటర్స్ లో రిలీజ్ అయింది. థియేటర్ లో ఈ సినిమా డీసెంట్ టాక్ ను సంపాదించుకున్న తర్వాత.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ కి వచ్చేసింది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ప్రస్తుతానికి అయితే ఈ సినిమా కేవలం తమిళ్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. కానీ రానున్న రోజుల్లో తెలుగులో కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు ఇతర సినిమాలను ఏ విధంగా ఆదరిస్తున్నారో చూస్తూనే ఉన్నాము. ఎప్పుడో రిలీజ్ అయినా సినిమాలను కూడా తెలుగులో ఇప్పుడు పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని.. తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ సినిమా కూడా తెలుగులో వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఇప్పటివరకు సినిమా రంగంలో ఎలా అయినా గొప్ప స్థాయికి చేరుకోవాలని.. ఎంతో మంది ఎన్నో కలలను కనే కథలను చూసే ఉంటాము. ఈ సినిమా కూడా అలాంటిదే. కానీ ఈ సినిమాను ఇంకాస్త కొత్తగా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో హీరో తన కలలను ఎలా నెరవేర్చుకున్నాడో తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే, మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetcasibomjojobetcasibomjojobetMariobetMadridbetbetciomatbet girişjojobetpalazzobetgrandpashabetgrandpashabetJojobet Girişcasibom girişgrandpashabetbetasusCasibom GirişJojobetcasibomcasibomjojobetcasibom girişjojobet girişcasibomJojobetGrandpashabetGrandpashabet