Taapsee Romantic Crime Thriller Sequel In OTT: ప్రియుడి కోసం భర్తను చంపే భార్యగా తాప్సి! OTT లోకి బో*ల్డ్ సిక్వెల్!

ప్రియుడి కోసం భర్తను చంపే భార్యగా తాప్సి! OTT లోకి బో*ల్డ్ సిక్వెల్!

Taapsee Romantic Crime Thriller Sequel In OTT: ఇప్పుడంతా సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలు, సిరీస్ లకు కూడా సిక్వెల్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాప్సి నటించిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ కు సిక్వెల్ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

Taapsee Romantic Crime Thriller Sequel In OTT: ఇప్పుడంతా సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలు, సిరీస్ లకు కూడా సిక్వెల్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో తాప్సి నటించిన ఓ ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ కు సిక్వెల్ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఎంతైనా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ , సైకో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూ ఉంటాయి. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా కానీ ఇంకా ఇంకా చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే ఈ జోనర్ లో లెక్కలేనన్ని సినిమాలు , సిరీస్ లు ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేశాయి. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి మరొక ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ రాబోతుంది. అది కూడా ఓ ఫేమస్ సినిమాకు సిక్వెల్ గా వస్తుంది. ఇప్పుడు అంతా సిక్వెల్స్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ అయినా సినిమాలు , సిరీస్ లకు కూడా సిక్వెల్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు రాబోయే మూవీ.. తాప్సి నటించిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హసీన్ దిల్‌రుబాకి సిక్వెల్. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

2021 లో తాప్సి మెయిన్ లీడ్ లో హసీన్ దిల్‌రుబా అనే సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ లభించింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సిక్వెల్ గా.. ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రుబా అనే పేరుతో మరో మూవీ రాబోతుంది. ఈ సినిమాలో తాప్సి తో పాటు.. 12th ఫెయిల్ ఫేమ్ విక్రాంత్ మస్సి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఇక వీరితో పాటు సన్నీ కౌశల్, జిమ్మీ షెర్గిల్ కూడా ముఖ్య పాత్రలలో నటించారు. గత ఏడాదే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు మేకర్స్. ఈ సిక్వెల్ మూవీ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో.. ఆగస్టు 9 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇంకా దీనిపై మరిన్ని అప్ డేట్స్ రావాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు మొదటి పార్ట్ హసీన్ దిల్‌రుబా మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి.

హసీన్ దిల్‌రుబా కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో రాణి పాత్రలో తాప్సి నటించింది. ఆమె భర్తగా విక్రాంత్ మస్సి నటించాడు. అయితే అనుకోకుండా ఆమె భర్త మరణించడంతో.. రాణినే పథకం ప్రకారం తన ప్రియుడుతో ఉండడం కోసం.. ఈ హత్య చేసిందనే ఆరోపణలు మొదలవుతాయి. ఇక ఈ కేసుపై పోలీసులు ఆమెను విచారిస్తున్న క్రమంలో.. అక్కడ నుంచి మూవీ గతాన్ని చూపిస్తారు. తన బాయ్ ఫ్రెండ్ వదిలేయడంతో.. తాప్సి బలవంతగా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటుంది. అయితే పెళ్లి తర్వాత ఆమె సంసార జీవితం అంత హ్యాపీగా ఉండదు. ఈ క్రమంలో వాళ్ళ ఇంటికి ఒక అతను వస్తాడు, అతనికి అట్ట్రాక్ట్ అయ్యి.. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. ఆమె అతనిని పెళ్లి చేసుకుంటానని చెప్పగానే అతను ఆ ఇంటి నుంచి పారిపోతాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త అప్పటినుంచి శాడిస్ట్ లా ఆమెను హింసిస్తూ ఉంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో.. అనూహ్యంగా చనిపోయాడనుకున్న తన భర్త తిరిగి వస్తాడు. దీనితో ఈ తప్పు ఆమె చేసిందని పోలీసులు నిరూపించలేకపోతారు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. మరి ఈ సిక్వెల్ లో స్టోరీ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.

ఇది కూడా చూడండి.. తాప్సి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చేసిందా! OTTలో ఈ మూవీలో ట్విస్టులే ట్విస్టులు

Show comments