iDreamPost
android-app
ios-app

OTTలోకి వచ్చేసిన వైవా హర్ష సుందరం మాస్టర్ మూవీ

  • Published Mar 24, 2024 | 7:03 PM Updated Updated Mar 28, 2024 | 1:58 PM

యూట్యూబర్ గా పాపులర్ అయి ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకున్న హర్ష చముడు (వివా హర్ష), ఈ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజం ఆశీస్సులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

యూట్యూబర్ గా పాపులర్ అయి ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకున్న హర్ష చముడు (వివా హర్ష), ఈ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజం ఆశీస్సులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.

  • Published Mar 24, 2024 | 7:03 PMUpdated Mar 28, 2024 | 1:58 PM
OTTలోకి వచ్చేసిన వైవా హర్ష సుందరం మాస్టర్ మూవీ

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన తాజా చిత్రం సుందరం మాస్టర్. యూట్యూబర్ గా పాపులర్ అయి ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా నిలదొక్కుకున్న హర్ష చముడు (వివా హర్ష), ఈ సినిమాతో హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి లాంటి దిగ్గజం ఆశీస్సులతో ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా డిజిటల్ ఫీల్డ్ లోకి ఎప్పుడు అడుగు పెడుతుందో ప్రకటించారు నిర్మాతలు.

థియేటర్లలో విడుదలైన ఐదు వారాలకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. ఈ చిత్రం యొక్క స్ట్రీమింగ్ హక్కులను తెలుగు ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఆహా యాప్ దక్కించుకుంది. కాగా, ఈ సినిమా  నేటి నుంచి అనగా (మార్చి 28 గురవారం )  నుంచి స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది.   మరి ఈ సినిమా ఇప్పటికి చూడాని వారు ఉంటే వెంటనే ఈ సినిమాను ఆహా చూసి ఎంజాయి చేయాండి.  ఇర ఈ సినిమాకు మాస్ మహారాజ్ రవితేజ నిర్మించగా.. శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించారు.

ఇక సుందర్ మాస్టర్ సినిమా  విషయానికొస్తే.. మధ్యలో ఉన్న మిర్యాల మెట్ట అనే ఊరి వాళ్లకి ఇంగ్లిష్ టీచర్ గా వచ్చి  పాఠలు చెప్పడమే ఈ సినిమ కథా.  నిజానికి సోషల్ సబ్జెక్ట్ టీచర్ అయిన సుందరం మాస్టర్‌ను టీచర్‌ ఆ ఊరిలోని వారందరూ గడగడ ఇంగ్లిష్‌ మాట్లాడుతూ తనకే ఎదురు పరీక్ష పెట్టేసరికి ఖంగుతింటాడు. ఆ తరువాత ఆ ఊరి వాళ్ళతో ఎలా మసులుకున్నాడు అనేది మిగతా కథ. మంచి కామెడీతో పాటు మెసేజ్ కూడా ఇవ్వాలని కళ్యాణ్ కృష్ణ ప్రయత్నం కొంత మేరకే ఫలించింది అని విమర్శకులతో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడ్డారు. అయితే ఈ సినిమా థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువ ఆదరణ పొందుతుందని కొందరు విమర్శకులు అన్నారు. ఈ మధ్య చిన్న సినిమాలు థియేటర్లలో సరైన ఆదరణ తెచ్చుకొలేక పోయినా… ఓటీటీ కాస్త బెటర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. అయితే ఓటీటీలో సుందరం మాస్టర్ సినిమా ఎలాంటి స్పందన తెచ్చుకుంటుందో చూడాలి. మరి, ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సుందర్ మాస్టర్ సినిమా పై మీ అభిప్రాయాాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.