iDreamPost
android-app
ios-app

OTT లో సుమంత్ అనగనగ కు… సూపర్ హిట్ రెస్పాన్స్

  • Published May 16, 2025 | 12:08 PM Updated Updated May 16, 2025 | 12:08 PM

OTT లో నిత్యం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ కు కలిగిస్తూ ఉంటాయి. వాటిలో రీసెంట్ గా రిలీజ్ అయినా సుమంత్ అనగనగ ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

OTT లో నిత్యం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. కానీ వాటిలో కేవలం కొన్ని మాత్రమే ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ కు కలిగిస్తూ ఉంటాయి. వాటిలో రీసెంట్ గా రిలీజ్ అయినా సుమంత్ అనగనగ ఒకటి. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.

  • Published May 16, 2025 | 12:08 PMUpdated May 16, 2025 | 12:08 PM
OTT లో సుమంత్ అనగనగ కు… సూపర్ హిట్ రెస్పాన్స్

OTT ల డిమాండ్ ఎంత పెరిగిందంటే.. వెండితెర మీద నటించిన స్టార్ హీరోలు , హీరోయిన్స్ కూడా బుల్లితెర మీదకు రావటానికి అసలు వెనకడుగు వేయడం లేదు. ఈ క్రమంలో రీసెంట్ గా హీరో సుమంత్ కూడా అనగనగా సినిమాతో OTT ఎంట్రీ ఇచ్చేసాడు. సుమంత్ సినిమాలు అన్నీ సూపర్ హిట్ లో అవ్వకపోయినా కచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూడాలని మాత్రం అనిపించేలా ఉంటాయి. టాలెంట్ ఉన్నా సరే అనేక కారణాల వలన సుమంత్ ఎందుకో ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయాడు. అయినా సరే సీతారామం లాంటి సినిమాలో విలన్ గా మంచి రోల్స్ లో నటించి ప్రేక్షకులకు దగ్గరౌతూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే అనగనగతో OTT ఎంట్రీ ఇచ్చాడు.

ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇలాంటి సినిమాలు చాలా రేర్ గా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు , వారి తల్లిదండ్రులు కలిసి చూడాల్సిన ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ అనగనగ. ప్రస్తుతం కార్పొరేట్ స్కూల్స్ లో పిల్లలు ఎలాంటి ఒత్తిడికి గురౌతున్నారో , దానివలన పిల్లల మీద ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అనే ఎన్నో విషయాలను.. ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు దర్శకుడు. బట్టికొట్టి పాస్ అవ్వడం కంటే పిల్లలు పాఠాలను కథల ద్వారా మెదడుకు ఎక్కించుకుంటే ఎలా ఉంటుంది అనే ఫ్రెష్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ వారం OTT లో రిలీజ్ అయిన సినిమాలలో ఈ సినిమా బెస్ట్ అని అనిపించుకుంటుంది. కాబట్టి ఇంకా ఈ సినిమాను ఎవరైనా చూడకపోతే కనుక వెంటనే ఈటీవీ విన్ లో చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.