SS Rajamouli Documentary: Netflixలో దుమ్మురేపుతున్న రాజమౌళి డాక్యుమెంటరీ.. స్టార్ హీరోస్ కు పోటీగా..

Netflixలో దుమ్మురేపుతున్న రాజమౌళి డాక్యుమెంటరీ.. స్టార్ హీరోస్ కు పోటీగా..

SS Rajamouli Documentary: దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే. రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే ప్రతి ఒక్కరికి అందులో ఏం ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దీనితో ఈ డాక్యుమెంటరీ అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

SS Rajamouli Documentary: దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీని రూపొందించిన సంగతి తెలిసిందే. రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే ప్రతి ఒక్కరికి అందులో ఏం ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. దీనితో ఈ డాక్యుమెంటరీ అప్పుడే ట్రెండింగ్ లోకి వచ్చేసింది.

రాజమౌళి.. ఇండస్ట్రీలో ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఓ బ్రాండ్ అని చెప్పి తీరాలి. ఇప్పటివరకు రాజమౌళి రూపొందించిన చిత్రాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించాయి. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్ ను కూడా చాలా జాగ్రత్తగా రూపొందిస్తాడు రాజమౌళి. అందుకే అతనిని ఇండస్ట్రీ లో జక్కన్న అని పిలుచుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ అందరికి తెలిసినవే. అయితే ప్రేక్షకులకు మంచి మూవీస్ ను అందించే రాజమౌళిపై.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందించిన సంగతి తెలిసిందే. రాజమౌళిపై డాక్యుమెంటరీ అంటే ప్రతి ఒక్కరికి అందులో ఏం ఉంటుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది. మరి ఈ డాక్యుమెంటరీ గురించి చూసేద్దాం.

“మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి” అనే పేరుతో.. నెట్ ఫ్లిక్స్ ఈ డాక్యుమెంటరీని రూపొందించింది. ఆగష్టు 2 నుంచి ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతుంది. దీనిలో ఆయన వ్యక్తిగత జీవితం, అసలు మూవీస్ లోకి ఎలా వచ్చారు, ఈ క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు ఏంటి , వాటిని ఎలా ఎదుర్కొన్నారు ఇలా అన్నిటి గురించి చూపించారు. తెలుగు , హిందీ , తమిళ , ఇంగ్లీష్ భాషల్లో ఈ డాక్యుమెంటరీని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఇండస్ట్రీని ఏలేస్తున్న దర్శకుడు గురించి తెలుసుకోవాలని ఎవరికి ఉండదు. అందుకే ఇలా ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయిందో లేదో అప్పుడే ట్రెండింగ్ అయిపోతుంది. ఓ విధంగా చెప్పాలంటే ఈ డాక్యుమెంటరీ ఇప్పుడున్న యంగ్ డైరెక్టర్స్ కు చాలా ఉపయోగపడుతుంది.

మోడ్రన్‌ మాస్టర్స్‌: ఎస్‌ఎస్‌ రాజమౌళి విషయానికొస్తే.. డాక్యుమెంటరీలో తారక్ , చరణ్ ,కరణ్ జోహార్, కొంతమంది బాలీవుడ్ స్టార్స్ రాజమౌళి గురించి చెప్పిన విషయాలు , ఆయన కుటుంబ సభ్యులు పంచుకున్న విశేషాలు , అలాగే పని విషయంలో ఆయన ఆలోచించే తీరు, దాని పట్ల అతను వహించే శ్రద్ద, అంతే కాకుండా రాజమౌళిపై పలువురు ప్రశంసించిన కొన్ని వీడియో క్లిప్స్ ను కూడా ఈ డాక్యుమెంటరీలో చూపించారు. రాజమౌళి గురించి తెలియని ఎన్నో విషయాలను దీని ద్వారా అందరికి తెలియజేశారు. రాజమౌళి దర్శకుడిగా మారిన తీరు.. ఈ క్రమంలో ఆయన ఎదురుకున్న పరిస్థితిలు, టోటల్ గా ఆయన జర్నీ ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాజమౌళి గురించి తెలుసుకోవాలంటే ఈ డాక్యుమెంటరీ చూడాల్సిందే. ఇంకా దీనిని చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ డాక్యుమెంటరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments