Swetha
Squid Game Season 2 Streaming Date: వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని స్పెషల్ వెబ్ సిరీస్ లు ఉంటాయి. వాటిలో స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. తాజాగా ఈ సిరీస్ సీజన్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.ఆ వివరాలేంటో చూసేద్దాం.
Squid Game Season 2 Streaming Date: వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకునే కొన్ని స్పెషల్ వెబ్ సిరీస్ లు ఉంటాయి. వాటిలో స్క్విడ్ గేమ్ సిరీస్ కూడా ఒకటి. ఈ వెబ్ సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. తాజాగా ఈ సిరీస్ సీజన్ 2 కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వచ్చేసింది.ఆ వివరాలేంటో చూసేద్దాం.
Swetha
ఓటీటీ లో సినిమాలకంటే కూడా వెబ్ సిరీస్ లకు ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారన్న సంగతి తెలియనిది కాదు. ఈ క్రమంలో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న కొన్ని స్పెషల్ వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి. వాటిలో ఒకటి స్క్విడ్ గేమ్. ఈ సిరీస్ మొదటి సీజన్ కు ఊహించని రెస్పాన్స్ దక్కింది. దీనితో ఇక ఇప్పుడు ఈ సిరీస్ కు రెండవ సీజన్ ను అనౌన్స్ చేశారు. తాజాగా రెండవ సీజన్ స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. దీనితో ప్రేక్షకులంతా ఈ సిరీస్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. మరి ఈ సిరీస్ రెండో సీజన్ ఎప్పటినుంచి స్టార్ట్ అవుతుందో చూసేద్దాం.
తాజాగా స్క్విడ్ గేమ్ సీజన్-2 అప్ డేట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రివీల్ చేశారు. ఈ పోస్టర్ ను గమనిస్తే.. గేమ్ లో ఓడిపోయిన 392 నంబర్ జెర్సీ వ్యక్తిని.. గేమ్ కండక్ట్ చేసేవారు చంపేసినట్లుగా చూపించారు. మొత్తం బ్లడ్ తో నిండినట్లుగా కనిపిస్తున్న ఈ పోస్టర్ లో ది గేమ్ విల్ నాన్ స్టాప్.. రెడీ ఫర్ ది నెక్స్ట్ లెవెల్ అంటూ చూపించిన క్యాప్షన్స్.. ఈ సీజన్ పై మరింత ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నాయి. పైగా ఈ సీజన్ లో గేమ్ రూల్స్ కూడా డిఫరెంట్ గా ఉండనున్నట్లు సమాచారం. సీజన్ 2 లో లీ జంగ్ జే, వి హ జూన్, గాంగ్ యో కీతో పాటు మరికొంతమంది కొరియన్ నటి నటులు ప్రధాన పాత్రలలో నటించనున్నారు. మొదటి సీజన్ కు మించిన ట్విస్ట్ లు , ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ తూ ఈ సీజన్ కొనసాగుతుంది. దాదాపు అన్ని రియల్ గేమ్స్ తోనే రెండో సీజన్ కొనసాగనున్నట్లు సమాచారం. ఈ సీజన్ డిసెంబర్ 26 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానున్నట్లు సమాచారం.
స్క్విడ్ గేమ్ మొదటి సీజన్ విషయానికొస్తే.. 2021 లో రిలీజ్ అయినా ఈ సిరీస్.. మంచి వ్యూవర్ షిప్ దక్కించుకుని.. ఓల్డ్ రికార్డ్స్ ను తిరగరాసింది. నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ కు 1.65 బిలియన్ల స్ట్రీమింగ్ వ్యూస్ దక్కాయి. ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. ఆర్ధిక ఇబ్బందులు, అప్పులతో బాధపడుతున్న 456 మంది.. స్క్విడ్ గేమ్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఈ గేమ్ రూల్స్ అన్ని కూడా చాల డిఫరెంట్ గా ఉంటాయి. ఓడిపోయినా వారిని చంపేస్తూ ఉంటారు. ఇలా చివరి వచ్చే సరికి గేమ్ లో ఇద్దరే మిగిలి ఉంటారు. ఇద్దరే ఎలా మిగిలారు ? గేమ్ లో విన్నర్ గా ఎవరు నిలిచారు ? ఒకరినొకరు ఎలా మోసం చేసుకున్నారు ? అనేదే సిరీస్ కథ. మొదటి సీజన్ మొత్తం 9 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇంకా ఎవరైనా మొదటి సీజన్ చూడకపోతే కనుక వెంటనే చూసేయండి. ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.