iDreamPost

Kurangu Pedal OTT: OTT లోకి శివ కార్తికేయన్ అవార్డు విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..

  • Published Jun 03, 2024 | 2:44 PMUpdated Jun 03, 2024 | 2:44 PM

థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం అయినా లేట్ అవుతుందేమో కానీ .. ఓటీటీ లోకి మాత్రం చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక కొత్త సినిమా యాడ్ అయిపోయింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

థియేటర్ లో సినిమాలు రిలీజ్ అవ్వడం అయినా లేట్ అవుతుందేమో కానీ .. ఓటీటీ లోకి మాత్రం చాలా స్పీడ్ గా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక కొత్త సినిమా యాడ్ అయిపోయింది. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published Jun 03, 2024 | 2:44 PMUpdated Jun 03, 2024 | 2:44 PM
Kurangu Pedal OTT: OTT లోకి శివ కార్తికేయన్ అవార్డు  విన్నింగ్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..

ఇప్పుడు ఎక్కడ చూసిన వినిపిస్తున్న పేరు ఒకటే ఓటీటీ. ప్రతి వారం డజన్లలో సినిమాలు, సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. ఇక కేవలం ఆ సినిమాలు తెలుగులో ఉంటేనే చూస్తాం అనుకునే ప్రేక్షకులైతే.. ఇప్పుడు ఎవరు లేరు. దాదాపు అందరూ అన్ని భాషల చిత్రాలను కథలను బట్టి ఆరాదిస్తూనే ఉన్నారు. ఈ తరహాలో ఇప్పటికే ఎన్నో సినిమాలు, సిరీస్ లు ఇతర భాషల్లో వచ్చి. మంచి కంటెంట్ తో ప్రేక్షకుల మెప్పును పొందాయి. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక సినిమా యాడ్ అవ్వడానికి రెడీ అయిపోతుంది. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇతను ఓ వైపు హీరో గా బిజీ బిజీ గా ఉంటూనే.. మరో వైపు మంచి కంటెంట్ ఉన్న కథలకు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో శివ కార్తికేయన్ చిన్న బడ్జెట్ సినిమాల నిర్మాణాల కోసం శివకార్తికేయన్ ప్రొడక్షన్స్ తో ఓ బ్యానర్ ను కూడా నెలకొల్పాడు.. ఇక తాజాగా శివ కార్తికేయన్ తమిళ్ లో ప్రొడ్యూస్ చేసిన సినిమా “కురంగు పెడల్”. ఈ సినిమాకు క‌మ‌ల క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా ఈ సినిమాలో కాళీ వెంక‌ట్‌తో పాటు సంతోష్‌వేళ్‌మురుగ‌న్‌, వీఆర్ రాఘ‌వ‌న్‌, ఎమ్ గ‌ణ‌శేఖ‌ర్‌, ర‌తీష్ ముఖ్య పాత్రలలో నటించారు. ఈ సినిమా మే 3 న థియేటర్ లో రిలీజ్ అయింది. ఇక త్వరలోనే ఈ సినిమా ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా జూన్ 14 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహలో స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. మొదట తమిళంలో మాత్రమే రిలీజ్ అయినా కానీ.. ఆ తర్వాత తెలుగు ప్రేక్షకుల కోసం తెలుగులో కూడా ఈ సినిమా రానుంది.

Siva

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. 1980’s నాటి చిన్నప్పటి మెమరీస్ ను గుర్తుచేస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు మేకర్స్. ఈ కథ ప్లాట్ చాలా చిన్నది. చిన్నప్పుడు అందరూ సైకిల్ నడపడం నేర్చుకోవాలని ఎన్నో ఫైట్స్ చేసేవారు. ఈ సినిమా కూడా ఇదే కోవకు చెందిందే.. చిన్నతనం నుంచి సైకిల్ నడపడం నేర్చుకోవాలని కలలు కన్న ఓ యువకుడు.. ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు. తనకు సైకిల్ నడపడం రాని తన కొడుకుకి ఎలా నేర్పించాడు, ఈ ప్రయాణంలో వారిద్దరూ ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనేది ఎంతో భావోద్వేగంగా ఈ సినిమాలో చూపించారు మేకర్స్. మరి మీ చిన్ననాటి జ్ఞాపకాల కోసం ఈ సినిమా చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి