Swetha
OTT Detective Crime Series: షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ స్టోరీస్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ డిటెక్టీవ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
OTT Detective Crime Series: షెర్లాక్ హోమ్స్ స్టోరీస్ కు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ స్టోరీస్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ డిటెక్టీవ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ లోకి రాబోతుంది. మరి ఆ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.
Swetha
సహజంగానే క్రైమ్ కథా చిత్రాలు.. తర్వాత ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో ప్రేక్షకులను సినిమా మొత్తం చూసేలా చేస్తాయి. ఇప్పటివరకు ఈ జోనర్ లో చాలానే చిత్రాలు వచ్చి ఉంటాయి. అయితే వీటికంటే ముందు చాలా మంది డిటెక్టీవ్ క్రైమ్ కథలను కూడా బాగా ఇష్టపడుతూ ఉండేవారు. వాటిలో ముఖ్యంగా షెర్లాక్ హోమ్స్ కథలకు స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలో ఇప్పుడు ఆ స్టోరీస్ నుంచి మరొక ఇంట్రెస్టింగ్ డిటెక్టీవ్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ త్వరలోనే ఓటీటీ లో అడుగుపెట్టనుంది. డిటెక్టీవ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీస్ ఇష్టముంటే కనుక.. ఈ సిరీస్ వారికి కచ్చితంగా నచ్చేస్తుంది. మరి ఈ సిరీస్ ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ కు రానుంది.. అనే వివరాలపై ఓ లుక్ వేసేయండి.
డిటెక్టీవ్ క్రైమ్ కథల జోనర్ లో వస్తున్న కొత్త సిరీస్ పేరు.. “శేఖర్ హోమ్”. సర్ ఆర్ధర్ కానన్ రాసిన కొన్ని షెర్లాక్ హోమ్స్ డిటెక్టీవ్ కథల ఆధారంగా ఈ సిరీస్ ను రూపొందించారు మేకర్స్. ఆల్రెడీ ఎప్పుడో ఈ సిరీస్ కు సంబంధించిన గ్లిమ్ప్స్ ను అయితే రిలీజ్ చేశారు కానీ. సిరీస్ రిలీజ్ చేయడానికి మాత్రం కాస్త టైమ్ తీసుకున్నారు. ఇక తాజాగా ఈ సిరీస్ కు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. కాగా ఈ సిరీస్ ను శ్రీజిత్ ముఖర్జీ డైరెక్ట్ చేయగా.. కే కే మేనన్, రణ్‌వీర్ షోరే, రసికా దుగల్ లాంటి వారు ఈ సిరీస్ లో ప్రధాన పాత్రలలో నటించారు. ఇక ఈ సిరీస్ ను నేరుగా ప్రముఖ ఓటీటీ లోకి తీసుకురానున్నట్లు.. “ఎన్నో పరిష్కారం దొరకని మిస్టరీలు. వాటిని పరిష్కరించగలిగేది ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే. శేఖర్ హోమ్ ఆగస్ట్ 14 నుంచి మీ జియో సినిమా ప్రీమియంలో” అంటూ జియో సినిమా ప్లాట్ ఫార్మ్ ప్రకటించింది. కాబట్టి ఎంచక్కా ఈ సిరీస్ ను చూసి ఎంజాయ్ చేసేయండి.
ఇక శేఖర్ హోమ్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. 1990 బ్యాక్డ్రాప్ లో ఈ కథ కొనసాగుతుంది.. వెస్ట్ బెంగాల్ లోని లోన్పూర్ అనే టౌన్ లో శేఖర్ , మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఉంటూ ఉంటాడు. ఈ కథ అంతా కూడా అక్కడే జరిగినట్లు చూపించారు. శేఖర్ అదే ప్రాంతంలోని మిస్టరీలను ఛేదిస్తూ ఉంటాడు. అతను ఎలాంటి క్రైమ్ కేసులను సాల్వ్ చేస్తాడు? డిటెక్టీవ్ గా అతను ఏ విధంగా సమస్యలకు పరిష్కారాలు కే తెలియజేస్తాడు ? ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. షెర్లాక్ హోమ్స్ నుంచి తీసుకున్న కథ కాబట్టి సిరీస్ టైటిల్ కూడా అదే విధంగా పెట్టారు.. దీనితో అందరికి ఈ సిరీస్ పై ఇంట్రెస్ట్ మొదలైంది. మరి ఈ సిరీస్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.