iDreamPost
android-app
ios-app

OTTలో రికార్డులు క్రియేట్ చేస్తున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. మీరు చూశారా?

  • Published Mar 17, 2024 | 4:08 PM Updated Updated Mar 17, 2024 | 4:08 PM

Save The Tigers Season 2: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. ఈసారి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఈసారి సీజన్ లో ఫన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కూడా అదిరిపోయాయి.

Save The Tigers Season 2: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. ఈసారి కూడా రికార్డుల మోత మోగిస్తోంది. ఈసారి సీజన్ లో ఫన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్ కూడా అదిరిపోయాయి.

  • Published Mar 17, 2024 | 4:08 PMUpdated Mar 17, 2024 | 4:08 PM
OTTలో రికార్డులు క్రియేట్ చేస్తున్న సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. మీరు చూశారా?

గతేడాది వచ్చిన సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ కు వచ్చిన స్పందన అంతా ఇంతా కాదు. అసలు కామెడీ సిరీస్లు ఏమీ లేవు అనుకునే సమయంలో తెలుగులో ఈ సేవ్ ది టైగర్స్ వచ్చింది. మగజాతి ఆణిముత్యాల కష్టాలు, వారు ఇళ్లల్లో పడే పాట్లను చూపిస్తూ ఈ సిరీస్ ని నిర్మించారు. పైగా ఇది తెలుగు సిరీస్ కావడం మరో కలిసొచ్చే అంశం అయ్యింది. గతేడాది ఓటీటీలో రికార్డులు బ్రేక్ చేసిన ఈ సిరీస్ ఇప్పుడు సీజన్ 2తో ప్రేక్షకులను అలరిస్తోంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సేవ్ ది టైగర్స్ సీజన్ 2 మరోసారి అదిరిపోయే రికార్డులు కొల్లగొడుతోంది. సీజన్ 2లో కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేసింది.

తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన వెబ్ సిరీస్ లలో సేవ్ ది టైగర్స్ పేరు తప్పకుండా ఉంటుది. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా సీజన్ 2తో ఓటీటీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తోంది. మార్చి 15 నుంచి డీస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో సేవ్ ది టైగర్స్ సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ లో కృష్ణచైతన్య, ప్రియదర్శి, అభినవ్, సుజాత, పావని, దేవయాని యాక్టింగ్ కి మంచి అప్లాజ్ లభిస్తోంది. సీజన్ 1కి మించి సీజన్ 2లో వీళ్లు తమ యాక్టింగ్ తో సిరీస్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లారు.

తొలి సీజన్ క్రియేట్ చేసిన రికార్డులు అందరికీ తెలిసిందే. ఐఎండీబీలో ఈ సీజన్ 1కి 8 రేటింగ్ దక్కంది. ఇప్పుడు సీజన్ 2 వంతు వచ్చింది. గత రెండ్రోజులుగా సేవ్ ది టైగర్స్ సిరీస్ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది. డిస్నీప్లస్ హాట్ స్టార్ యాప్ లో ఇండియాలో స్ట్రీమ్ అవుతున్న తెలుగు కంటెంట్ లో టాప్ 10లో సేవ్ ది టైగర్స్ ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతోంది. ఇప్పటికే విడుదలై రెండ్రోజులు అవుతోంది. ఇంకా టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది. టాప్ హీరోల సినిమాలకు కూడా దక్కని క్రేజ్ అయితే హాట్ స్టార్ లో సేవ్ ది టైగర్స్ సీజన్ కి దక్కుతోంది.

కథ ఏంటంటే?:

తొలి సీజన్ లో నటి హంసలేఖ అదృశ్యం అవ్వడంతో సీజన్ ముగుస్తుంది. మళ్లీ అక్కడి నుంచే సీజన్ 2 స్టార్ట్ చేశారు. హంసలేఖ తప్పిపోయినప్పటి సీసీటీవీ ఫుటేజ్ పోలీసులకు లభిస్తుంది. దాని ఆధారంగా ముగ్గురు మగజాతి ఆణిముత్యాలను పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తారు. ఒకవైపు మీడియా అయితే హంసలేఖను హత్య చేశారు అంటూ కృష్ణ చైతన్య, ప్రియదర్శి, అభినవ్ పై నిందలు వేస్తుంది. అయితే అనూహ్యంగా హంసలేఖ తిరిగి వస్తుంది. నటి తిరిగి రావడంతో ఆ ముగ్గురిని పోలీసులు వదిలేస్తారు. కానీ, ఇంట్లో సమస్యలు మరింత ముదురుతాయి. మూడు జంటలు కౌన్సిలింగ్ కి వెళ్లడం స్టార్ట్ చేస్తాయి. అయితే వీళ్లకు అస్సలు గొడవలు ఎందుకు వచ్చాయి? కౌన్సిలింగ్ వల్ల వారి దాంపత్య జీవితంలో మార్పు వచ్చిందా? అసలు సేవ్ ది టైగర్స్ సీజన్ 2లో వీళ్లు ఏం హంగామా చేశారు? అనే ప్రశ్నలకు సేవ్ ది టైగర్స్ సీజన్ 2 చూసి సమాధానాలు తెలుసుకోవాల్సిందే.

Jojobet Girişjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetgoo girişgrandpashabetEscortes Belgique