iDreamPost
android-app
ios-app

తెలుగు OTTలోకి కట్టప్ప బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

  • Published Aug 04, 2024 | 12:49 PM Updated Updated Aug 04, 2024 | 12:49 PM

బాహుబలి మూవీతో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ తాజాగా నటించిన మూవీ వెపన్. తమిళంలో జూన్ 7న రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

బాహుబలి మూవీతో కట్టప్పగా అలరించిన సత్యరాజ్ తాజాగా నటించిన మూవీ వెపన్. తమిళంలో జూన్ 7న రిలీజైంది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే..?

  • Published Aug 04, 2024 | 12:49 PMUpdated Aug 04, 2024 | 12:49 PM
తెలుగు OTTలోకి కట్టప్ప బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

కోలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోల్లో ఒకరు సత్యరాజ్. విలన్ నుండి హీరోగా మారి సక్సెస్ సాధించాడు. తెలుగు ప్రేక్షకులకు మాత్రం ఆయన ఎప్పటికీ కట్టప్పే. బాహుబలికి ముందు ఆయన ఎన్నో సినిమాలు చేసినా.. కట్టప్పగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తిండిపోతాడు. తమిళ్, తెలుగు మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, హిందీ పరిశ్రమలో వర్క్ చేసిన నటుడు. యాక్టర్ మాత్రమే కాదు.. ప్రొడ్యూసర్, దర్శకుడు కూడా. సుమారు 20 చిత్రాలు చేశాడు. ఇప్పుడు ఆయన నటించిన మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందకు వచ్చింది. అదే వెపన్. జూన్ 7న థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. తమిళంలో ఓటీటీలోకి వచ్చేసింది.

ఇప్పుడు తెలుగు వెర్షన్‌ని మరో ఓటీటీలో అందుబాటులోకి తీసుకొచ్చారు. సత్యరాజ్, వసంత్ రవి కీలక పాత్రల్లో నటించిన మూవీ వెపన్. తాన్యా హోప్ కథానాయిక. రాజీవ్ మీనన్, రాజీవ్ పిళ్లై కీలక పాత్రలు పోషించారు. గుహన్ సెన్నియప్పన్ దర్శకత్వం వహించాడు. మిలియన్ స్టూడియో పతాకంపై ఎంఎస్ మంజూర్ నిర్మించారు. జిబ్రాన్ సంగీతం అందించాడు.  సూప‌ర్ హీరో క‌థాంశానికి యాక్ష‌న్, సైన్స్ ఎలిమెంట్స్‌ను జోడించి  వెప‌న్‌ మూవీని తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు . జూన్ 7 న థియేటర్లలో విడుదలవ్వగా అంతగా ఆకట్టుకోలేదు. జూలై 26 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీ ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఇప్పుడు తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో డిజిటల్ స్క్రీనింగ్ అవుతుంది.. ఇక సినిమా ఫ్లాట్ విషయానికి వస్తే.. అగ్ని (వసంత్ రవి) ఓ యూట్యూబర్. ప్రకృతి పరిరక్షకుడు. అయితే తేని జిల్లాలో ఓ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. అగ్నిని పోలీసులు అరెస్టు చేస్తారు. త‌న‌కు ఈ బ్లాస్ట్‌ల‌తో సంబంధం లేద‌ని, ఎవరికీ తెలియని సూప‌ర్ హీరో మిత్ర‌న్‌ (సత్యరాజ్) గురించి తాను వెతుకుతున్నాన‌ని పోలీసుల‌కు చెబుతాడు అగ్ని. ఇంతకు ఆ మిత్రన్ ఎవరు..? అతడికి అగ్నికి సంబంధమేమిటీ? అత‌డి కోసం అగ్నితో పాటు బ్లాక్ సొసైటీ 19 అనే స్పెష‌ల్ ఇన్వేస్టిగేష‌న్ టీమ్ ఎందుకోసం వెతుకుతున్నారు తెలియాలంటే సినిమా చూసేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetmeritbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom