iDreamPost
android-app
ios-app

శుభం మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

  • Published May 13, 2025 | 1:05 PM Updated Updated May 13, 2025 | 1:05 PM

ఏదైన సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందంటే ... దానికంటే ముందు అది ఏ OTT లోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయినా మూవీ శుభం. ఇప్ప్పుడు ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

ఏదైన సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందంటే ... దానికంటే ముందు అది ఏ OTT లోకి వస్తుందా అని అంతా ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయినా మూవీ శుభం. ఇప్ప్పుడు ఈ సినిమా OTT పార్ట్నర్ ఫిక్స్ అయింది దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published May 13, 2025 | 1:05 PMUpdated May 13, 2025 | 1:05 PM
శుభం మూవీ OTT పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?

టాలీవుడ్ లో హిట్ హీరోయిన్ గా అనిపించుకున్న సమంత ఇప్పుడు ప్రొడ్యూసర్ గా కూడా మంచి పేరు సంపాదించుకుంది. శుభం సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుంది. తనకున్న స్టార్ డమ్ తో శుభం మూవీ OTT , శాటిలైట్ రైట్స్ కూడా మంచి రేట్స్ కు అమ్ముడుపోయాయట. మొత్తానికి సామ్ మొదటిసారి ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన మూవీ సక్సెస్ అవ్వడంతో మూవీ టీం అంతా కూడా సక్సెస్ సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. ఇక ఏదైనా సినిమా థియేటర్ లో రిలీజ్ అయిందంటే ఆ సినిమా ఎప్పుడెప్పుడు OTT లోకి వస్తుందా ఏ OTT లోకి వస్తుందా అని మూవీ లవర్స్ తెగ ఎదురుచూస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఇప్పుడు శుభం మూవీ గురించి కూడా అలానే వెయిట్ చేస్తున్నారు ప్రేక్షకులు.

ఈ సినిమా రిలీజ్ కు ముందే.. నాన్ థియేట్రికల్ రైట్స్ మంచి రేట్ కు అమ్ముడుపోయాయట. సాధారణంగా ఇలాంటి సినిమాలకు థియేట్రికల్ రిలీజ్ కు ముందు నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం అంత సులభం కాదు. కానీ ఇక్కడ సీన్ లో సామ్ ఉంది కాబట్టి ఇది చాలా ఈజీ అయింది. అలాగే సినిమాకు పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడంతో మూవీ టీం అంతా శాటిస్ఫై అయ్యారు. ఇక శుభం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. స్ట్రీమింగ్ డేట్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అయితే సహజంగా మూవీ థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని OTT స్ట్రీమింగ్ డేట్స్ ను అనౌన్స్ చేస్తుంటారు మేకర్స్. ప్రస్తుతానికైతే శుభం మూవీ థియేట్రికల్ గా బాగానే రన్ అవుతుంది కాబట్టి.. వచ్చే నెలలో OTT ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఐకే ఏమౌతుందో చూడాలి. మరి ఈ సినిమా అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.