iDreamPost
android-app
ios-app

OTTలోకి సమంత యాక్షన్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ లీక్ చేసిన డైరెక్టర్స్

  • Published Jul 25, 2024 | 8:44 PM Updated Updated Jul 25, 2024 | 8:44 PM

Citadel: Honey Bunny.. ఫ్యామిలీ మెన్, ఫర్జీల వంటి హిట్ వెబ్ సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే నుండి రాబోతున్న సిరీస్ సీటాడెల్ హనీ-బన్నీ. అమెరికన్ సీటాడెల్‌కు ఇది ఇండియన్ వర్షన్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది.

Citadel: Honey Bunny.. ఫ్యామిలీ మెన్, ఫర్జీల వంటి హిట్ వెబ్ సిరీస్ లను అందించిన రాజ్ అండ్ డీకే నుండి రాబోతున్న సిరీస్ సీటాడెల్ హనీ-బన్నీ. అమెరికన్ సీటాడెల్‌కు ఇది ఇండియన్ వర్షన్. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతుంది.

  • Published Jul 25, 2024 | 8:44 PMUpdated Jul 25, 2024 | 8:44 PM
OTTలోకి సమంత యాక్షన్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ లీక్ చేసిన డైరెక్టర్స్

టాలీవుడ్ టాప్ హీరోయిన్లంతా బాలీవుడ్ బాట పడుతున్న సంగతి విదితమే. వారిలో ఒకరు లేడీ సూపర్ స్టార్ సమంత. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. రాజీ పాత్రలో అదరగొట్టేసింది. దీన్ని రాజ్ అండ్ కే తెరకెక్కించారు. ఇప్పుడు ఈ ద్వయం నేతృత్వంలో తెరకెక్కిన మరో వెబ్ సిరీస్ సీటాడెల్ (హనీ బన్నీ). అమెరికన్ సీటాడెల్‌కు ఇది ఇండియన్ వర్షన్. హాలీవుడ్ సీటాడెల్‌లో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మ్యాడెన్‌ నటించారు. ఇక ఇండియన్ వర్షన్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు  గతంలోనే ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ డేట్ డిక్లేర్ చేయలేదు.

తాజాగా ఈ ద్వయం ఇన్ స్టా వేదికగా ఈ వెబ్ సిరీస్ డేట్ ఎనౌన్స్ చేసినట్లు తెలుస్తుంది. రాజ్ అండ్ డీకే తన సోషల్ మీడియా పేజీ వేదికగా.. ‘01.08’ అని ఓ పోస్టర్ పంచుకున్నారు. అందులో హనీ, బన్నీ ఎమోజీలను పంచుకున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆగస్టు 1న సీటాడెల్ రాబోతున్నట్లు అర్థమౌతుంది. ఇదే అఫీషియల్ ఎనౌన్స్ మెంటా అనేది తెలియదు. ఈ లెక్క ప్రకారం.. వచ్చే గురువారం నుండి సీటాడెల్ ఇండియన్ వర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో అలరించబోతుంది. ఇక ఇందులో మాస్ యాక్షన్స్ సీక్వెన్స్ తెరకెక్కుతున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లోనూ శిక్షణ తీసుకుంది. ఈ సిరీస్ లో వరుణ్, సామ్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. ఇందులో డూప్ లేకుండా ఈ చిల్ బులీ నటించినట్లు తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ వెబ్ సిరీస్‌తోనే వరుణ్ ధావన్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే మయోసైటిస్‌కు చికిత్స తీసుకుంటూనే ఈ షూటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. 2022లో దీన్ని సీటాడెల్ ప్రకటించారు. గత ఏడాది జనవరిలో ఈ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. సెర్బియా, ఇండియాలో షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ పూర్తయ్యి ఏడాది పూర్తవ్వగా.. ఎట్టకేలకు విడుదలకు నోచుకుంటుంది. ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.. ట్రలాలా మూవీంగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. ఈ ఏడాది తన పుట్టిన రోజు సందర్భంగా మా ఇంటి బంగారం అనే మూవీని ఎనౌన్స్ చేసింది. అలాగే మరో సినిమా కూడా ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వెబ్ సిరీస్ తర్వాత డీకే, రాజ్ ద్వయంలో మరో సిరీస్ చేయనున్నట్లు తెలుస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Raj & DK (@rajanddk)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom