iDreamPost
android-app
ios-app

OTTలోకి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ.. ఒక యువతి రాజ్యాన్నే ఎదిరించి నిలబడి..

OTT New Releases: ఓటీటీలోకి ఈవారం అదిరిపోయే వెబ్ సిరీస్ రాబోతోంది. ఇన్నాళ్లు యాక్షన్ చూసిన ఆడియన్స్ కోసం ఒక ఫాంటసీ వెబ్ సిరీస్ వచ్చేసింది.

OTT New Releases: ఓటీటీలోకి ఈవారం అదిరిపోయే వెబ్ సిరీస్ రాబోతోంది. ఇన్నాళ్లు యాక్షన్ చూసిన ఆడియన్స్ కోసం ఒక ఫాంటసీ వెబ్ సిరీస్ వచ్చేసింది.

OTTలోకి ఫాంటసీ అడ్వెంచర్ మూవీ.. ఒక యువతి రాజ్యాన్నే ఎదిరించి నిలబడి..

ఓటీటీలోకి ఈ మధ్య సూపర్ అంటే సూపర్ చిత్రాలు, వెబ్ సిరీస్లు వస్తున్నాయి. వాటిలో యాక్షన్, డ్రామా, కామెడీ ఉంటున్నాయి. కానీ, ఒక మంచి ఫాంటసీ వెబ్ సిరీస్ వచ్చి కొన్ని నెలలు అవుతోంది. ఇప్పుడు ఆ గ్యాప్ ని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తీర్చబోతోంది. ఒక అద్భుతమైన హాలీవుడ్ ఫాంటసీ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పై చాలానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ నుంచి వచ్చిన ట్రైలర్స్ అభిమానుల్లో అంచనాలను అమాంతం పెంచేశాయి. ఒక యువతి ఒక రాజ్యం మీదే చేసే పోరాటం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మరి.. ఆ వెబ్ సిరీస్ ఏది? అసలు ఆ వెబ్ సిరీస్ ఎందుకంత ప్రత్యేకం చూద్దాం.

సాధారణంగానే హాలీవుడ్ వెబ్ సిరీస్లు అంటే తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి చూస్తుంటారు. ఎందుకంటే వీటిలో యాక్షన్, డ్రామా ఎక్కువగా ఉంటాయి. అదే ఫాంటసీ జానర్ అయితే అది నెక్ట్ లెవల్లో ఉంటుంది. అలాంటి ఒక జానర్ నుంచి ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తోంది. మార్చి 29 నుంచి ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కి వస్తోంది. అంటే గురువారం అర్ధరాత్రి నుంచే ఈ సిరీస్ అందుబాటులోకి రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పేరు “రెనెగేడ్ నెల్” ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ఒక లేడీ ఓరియంటెడ్ ఫాంటసీ అడ్వంచర్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్.

ఈ వెబ్ సిరీస్ లో ఫెయిరీస్, సూపర్ పవర్స్ అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. హీరోయిన్ ని ఈ వెబ్ సిరీస్ లో రకరకాలుగా పిలుస్తారు. ఇంగ్లాండ్ క్వీన్ వాల్లు దొంగ అంటారు. స్థానికులు హీరో అంటారు. ఆమె కోసం వెతికేవాళ్లు హైవే ఉమెన్ అని పిలుస్తారు. ఈమె దారి కాచి దోపిడీలు చేస్తూ ఉంటుంది. ఈమెకు కొన్ని సూపర్ పవర్స్ వస్తాయి. వాటితో ఆమె ఏం చేస్తుంది? అసలు ఆమె ఎందుకు అంత వాంటెడ్ క్రిమినల్ అయ్యింది? అసలు ఇంగ్లాండ్ రాణితో ఆమెకు ఉన్న గొడవ ఏంటి? అనేదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఆమెకు అవసరం అయినప్పుడల్లా ఒక ఫెయిరీ ఆమె గొంతు నుంచి శరీరంలోకి ప్రవేశసిస్తుంది.

బిల్లీ బ్లైండ్ అనే ఫెయిరీ నెల్లీ జాక్సన్ ని ఆవహిస్తుందనమాట. అలా చేయడం వల్ల ఆ యువతికి శక్తులు వస్తాయి. అప్పుడు ఆమె తనను తాను సైన్యం నుంచి, విలన్స్ నుంచి కాపాడుకుంటుంది. ఈ కథలో నెల్ ని ఒక హత్య కేసులో ఇరికిస్తారు. ఆ కేసుకు సంబంధించే ఆమెను వెంటాడుతూ ఉంటారు. ఈ కేసు వల్లే ఆమెపై హావే ఉమెన్ అనే పేరు వస్తుంది. అయితే అసలు ఆమెను హత్య కేసులో ఎవరు ఫ్రేమ్ చేశారు? ఈ ఫెయిరీ ఎందుకు ఆమెను ఆవహిస్తోంది? అసలు నెల్లీ జాక్సన్ లక్ష్యం ఏంటి? అనేవి తెలియాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetStarzbetJojobet GirişjojobetHoliganbet Giriş