Swetha
థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నెల రోజులలోపే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ నటించిన ఓ సినిమా ఈ వారం ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడో చూసేద్దాం.
థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా నెల రోజులలోపే ఓటీటీ లో ప్రత్యేక్షమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ నటించిన ఓ సినిమా ఈ వారం ఓటీటీ లోకి వచ్చేస్తుంది. మరి ఈ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడో చూసేద్దాం.
Swetha
థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాలు ఓటీటీ లోకి రావాలంటే ఓటీటీ రూల్స్ ప్రకారం కనీసం నెల రోజుల సమయం తీసుకోవాలి. లేదా థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటీటీ లో సినిమాలను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఈ మధ్య కాలంలో అయితే చాలా తొందరగా ఆయా సినిమాలు ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. వారం నెల రోజులు గడవకముందే డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా విశాల్ నటించిన చిత్రం “రత్నం” . ఈ వారం ఓటీటీ లో అడుగుపెట్టింది . మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.
అసలు రత్నం సినిమా కథేంటంటే.. హీరో చిన్నప్పుడే తన తల్లిదండ్రులను కోల్పోతాడు. అతను ఓ కూరగాయల మార్కెట్ లో పని చేస్తుంటాడు. ఈ క్రమంలోనే అక్కడ ఉండే సముద్రఖని ను ఓసారి అతని ప్రాణాలకు తెగించి మరి కాపాడతాడు. అతని కోసం ఒకర్ని చంపి జైలుకు కూడా వెళ్తాడు. దీనితో సముద్రఖని అతనిని సొంత కొడుకులా పెంచుకుంటాడు. ఈ క్రమంలో హీరో ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇంతలోనే ఆమెను చంపేందుకు ఎవరో ప్రయత్నిస్తారు. ఆమెను కూడా హీరో రక్షిస్తాడు . అసలు ఆమెను చంపాలనుకున్నది ఎవరు ! దాని వెనుక ఉన్న కథేంటి ! ఆ తర్వాత ఏం జరిగింది అనేదే ఈ సినిమా కథ. ఇంత ఇంట్రెస్టిగ్ సినిమా ఇంత త్వరగా ఓటీటీ లోకి రావడం విశేషం. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయినా ప్రేక్షకులు ఓటీటీ లో చూసేయండి.
అయితే, ఈ సినిమాకు హరి దర్శకత్వం వహించారు. కాగా జీ స్టూడియోస్, కారతికేయన్ సంతానం ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో విశాల్ తో పాటు, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ, యోగిబాబు లాంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఏప్రిల్ 26 న ఈ సినిమా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా డీసెంట్ టాక్, డీసెంట్ కలెక్షన్స్ తోనే థియేట్రికల్ రన్ ను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను కూడా మెప్పించేందుకు రెడీ అయిపొయింది. ఈ సినిమా మే 23 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది . మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.