iDreamPost
android-app
ios-app

OTT లోకి వచ్చేసిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం.. వీకెండ్ బెస్ట్ వాచ్

  • Published Sep 20, 2024 | 11:20 AM Updated Updated Sep 20, 2024 | 11:20 AM

OTT Telugu Movie- Maruthi Nagar Subramanyam : ఈ వీకెండ్ థియేటర్ లో చూసేందుకు అంత ఇంట్రెస్టింగ్ సినిమాలేమి లేవు. సో మూవీ లవర్స్ అంతా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

OTT Telugu Movie- Maruthi Nagar Subramanyam : ఈ వీకెండ్ థియేటర్ లో చూసేందుకు అంత ఇంట్రెస్టింగ్ సినిమాలేమి లేవు. సో మూవీ లవర్స్ అంతా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. అదేంటో చూసేద్దాం.

  • Published Sep 20, 2024 | 11:20 AMUpdated Sep 20, 2024 | 11:20 AM
OTT లోకి వచ్చేసిన మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం.. వీకెండ్ బెస్ట్ వాచ్

ఈ మధ్య కాలంలో థియేటర్ లో చిన్న సినిమాలే సత్తా చూపిస్తున్నాయి. దీనితో థియేటర్ లో ఆయా సినిమాలను మిస్ అయినా ప్రేక్షకులు.. ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తాయా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వారం థియేటర్ లో చెప్పుకోదగిన సినిమాలేమి లేవు. దీనితో మూవీ లవర్స్ అంతా కూడా ఓటీటీ ల వైపు అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లో చాలా తక్కువ తెలుగు సినిమాలు స్ట్రీమింగ్ కు రానున్నాయి. వాటిలో ఎంచక్కా ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ఓ ఇంట్రెస్టింగ్ మూవీ వచ్చేసింది. అదే రావు రమేష్ నటించిన మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. మరి ఈ సినిమా ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ లో , తండ్రిగా , అన్నగా , తమ్ముడిగా ఇలా.. అన్నిటిలో తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు రావు రమేష్. ఈ క్రమంలో తాజాగా ఆయన లీడ్ రోల్ లో నటించిన మూవీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం. ఆగష్టు 23న థియేటర్ లో రిలీజ్ అయినా ఈ సినిమా మొదటి షో నుంచి కూడా.. ఓ మంచి కామెడీ ఫ్యామిలీ డ్రామా గా ప్రశంసలు అందుకుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ.. బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా కూడా చిన్న సినిమాల సత్తా ఏంటో చూపించింది. కాగా ఈ సినిమాకు లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించగా.. రావు రమేశ్, ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి లాంటి వారు ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహా లో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వీకెండ్ ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడాలంటే ఈ మూవీ బెస్ట్ ఛాయిస్.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రావు రమేష్ ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దీనితో ఇల్లు గడవడం కోసం అతని భార్య ఉద్యోగం చేస్తూ ఉంటుంది. అతని కొడుకు అర్జున్ కూడా చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం లేకుండా ఖాళీగా ఉంటాడు. ఈ క్రమంలో అతను కాంచన అనే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అలా కష్టాలతో సాగిపోతున్న వారి జీవితంలో.. సడెన్ గా ఓ రోజు.. రావు రమేష్ అకౌంట్ లోకి రూ.10లక్షలు క్రెడిట్ అవుతాయి. వాటి అన్నిటిని కూడా తండ్రి కొడుకులు ఇద్దరు విచ్చల విడిగా ఖర్చు పెట్టేసుకుంటారు. దీనితో వారు చిక్కుల్లో పడతారు. అసలు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ? ఎవరు క్రెడిట్ చేశారు ? వారు ఎలాంటి ఇబ్బందులకు గురి అయ్యారు ? ఆ ఇబ్బందుల నుంచి బయటపడ్డరా లేదా అనేది తెరపై చూడాల్సిన కథ. ఇక ఈ సినిమా ఓటీటీ లో ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో వేచి చూడాలి. మరి ఈ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.