iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు OTT లోకి రజినీకాంత్ లాల్ సలాం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  • Published Sep 03, 2024 | 11:19 AM Updated Updated Sep 03, 2024 | 11:19 AM

Lal Salaam Movie OTT Streaming Date: సూపర్ స్టార్ రజిని కాంత్ తన కెరీర్ లో దాదాపు అన్ని హిట్స్ ఏ అందుకున్నారు. కానీ ఊహించని విధంగా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా లాల్ సలాం సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Lal Salaam Movie OTT Streaming Date: సూపర్ స్టార్ రజిని కాంత్ తన కెరీర్ లో దాదాపు అన్ని హిట్స్ ఏ అందుకున్నారు. కానీ ఊహించని విధంగా భారీ అంచనాల మధ్యన రిలీజ్ అయినా లాల్ సలాం సినిమా మాత్రం డిజాస్టర్ గా నిలిచిపోయింది. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Sep 03, 2024 | 11:19 AMUpdated Sep 03, 2024 | 11:19 AM
ఎట్టకేలకు OTT లోకి రజినీకాంత్ లాల్ సలాం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

తీసిన ప్రతి మూవీ హిట్ అవ్వాలన్నా రూల్ అయితే లేదు కానీ.. అదేంటో తెలియదు కానీ కొన్ని సార్లు పక్కా హిట్ కొట్టేస్తాయి అనుకున్న స్టార్ హీరోల సినిమాలు కూడా.. ఊహించని విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడతాయి. అయినా కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చిన తర్వాత ట్రెండింగ్ లోకి రావడం విశేషం. అది ఓటీటీ లకు ఉన్న క్రేజ్ వలనో లేదా అసలు సినిమా ప్లాప్ అవ్వడానికి రీజన్స్ తెలుసుకోవాలని ప్రేక్షకులు చూపించే ఇంట్రెస్ట్ వలనో తెలియదు. రీసెంట్ గా భారతీయుడు-2 ఇలాంటి ఆశ్చర్యాన్నే కలిగించింది. ఇక ఇప్పుడు రజిని కాంత్ కెరీర్ లో డిజాస్టర్ అయినా సినిమా లాల్ సలాం.. థియేటర్ లో రిలీజ్ అయినా ఏడు నెలల తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. తాజాగా అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రజిని కాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన సినిమా లాల్ సలాం. వీరిద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేయడంతో.. సినిమా పై అందరికి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఈ సినిమాను సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు. అలా భారీ అంచనాల మధ్యన ఫిబ్రవరి 9న ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ మొదటి షో నుంచే ఊహించని విధంగా.. నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో.. డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఏడు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీ లోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ సన్ నెక్స్ట్ సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 20 నుంచి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రానుంది. మరి ఓటీటీ లో ఈ మూవీ ఎలాంటి టాక్ ను సంపాదించుకుంటుందో వేచి చూడాలి.

ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. రజినీకాంత్ ఒక బిజినెస్ మ్యాన్, తన కొడుకును ఓ మంచి క్రికెటర్ గా చూడాలనేదే అతని కల. కానీ ఊరిలో క్రికెట్ మ్యాచ్ కారణంగా దారుణ మైన గొడవలు జరుగుతాయి. అది కాస్త మతకలహాలకు దారితీస్తుంది. ఈ గొడవలో రజిని కాంత్ కొడుకు చేతిని గురు అనే వ్యక్తి నరికేస్తాడు. ఇక అప్పటినుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఆ గురు ఎవరు ? ఆ గొడవ దేని కారణంగా పెరిగింది ? మత కలహాలకు వరకు ఎందుకు దారి తీసింది ? రజినీకాంత్ అతని కొడుకుకు జరిగిన అన్యాయం గురించి ప్రతీకారం తీర్చుకున్నాడా లేదా ? ఆ తర్వాత ఏమైంది ? అనేదే మిగిలిన కథ. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş