iDreamPost
android-app
ios-app

OTT డీల్ లో పుష్ప-2 నెక్స్ట్ లెవెల్స్ రికార్డ్స్.. ఎన్ని కోట్లంటే!

  • Published Aug 31, 2024 | 5:16 PM Updated Updated Aug 31, 2024 | 5:16 PM

Pushpa-2 Movie OTT Deal: థియేటర్ లో రిలీజ్ కాకముందే భారీ బజ్ ఉన్న సినిమాలకు ముందుగానే ఓటీటీ డీల్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా ఫిల్మ్ కు.. ఓటీటీ డీల్ భారీ ధరలకు క్లోజ్ అయినట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Pushpa-2 Movie OTT Deal: థియేటర్ లో రిలీజ్ కాకముందే భారీ బజ్ ఉన్న సినిమాలకు ముందుగానే ఓటీటీ డీల్ క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా ఫిల్మ్ కు.. ఓటీటీ డీల్ భారీ ధరలకు క్లోజ్ అయినట్లు సమాచారం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Aug 31, 2024 | 5:16 PMUpdated Aug 31, 2024 | 5:16 PM
OTT డీల్ లో పుష్ప-2  నెక్స్ట్ లెవెల్స్ రికార్డ్స్..  ఎన్ని కోట్లంటే!

థియేటర్ లో రిలీజ్ అయినా ఏ సినిమా అయినా ఓటీటీ లోకి రావాల్సిందే. బాగా బజ్ అయినా సినిమాలైతే .. థియేట్రికల్ రన్ ను బేస్ చేసుకుని ఓటీటీ ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఈ క్రమంలో డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కూడా.. ఆయా సినిమాలను కొనుగోలు చేయడానికి ముందుగానే పోటీ పడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఇండస్ట్రీలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా ఫిల్మ్.. పుష్ప-2. ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు ముందే.. అందరికి భారీ హైప్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ విషయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. దానికి సంబంధిచిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అల్లు అర్జున్ , సుకుమార్ కాంబినేషన్ లో ఇప్పుడు పుష్ప-2 సినిమా వస్తున్న సంగతి తెలియనిది కాదు. అసలు ముందుగా అనుకున్న సమయానికే ఈ మూవీ రిలీజ్ అయ్యి ఉంటే కనుక.. ఇప్పటికి బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసే కలెక్షన్స్ ను సాధించేది.. కానీ అది జరగలేదు. దీనితో అభిమానులు కాస్త నిరాశ చెందినా కూడా.. ఇలాంటి పాన్ ఇండియా మూవీ కోసం వెయిట్ చేసినా పర్లేదు అనుకుంటూ సరిపెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే ఇప్పటివరకు ఇండియాలోనే ఏ సినిమాకు జరగని.. ఓటీటీ డీల్ పుష్ప-2 కు జరిగిందట. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఏకంగా రూ.270 కోట్లకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసిందట. త్వరలోనే నెట్ ఫ్లిక్స్ ఈ విషయాన్నీ అధికారికంగా ప్రకటించనుంది.

సినిమా రిలీజ్ కు ముందే ఇలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందంటే.. ఇక రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంతకు మించిన అంచనాలను పెంచేసింది. రిలీజ్ తర్వాత అందరి అంచనాలను నిలబెట్టుకుంటుందా లేదా అనే విషయం తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఈ సినిమా డిసెంబర్ 6 న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ఈలోపు పుష్ప-2 నుంచి ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో.. అవి ఇంకెన్ని అంచనాలను పెంచుతాయో చూడాలి . మరి ఈ సినిమా ఓటీటీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.